More

    మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‎మోహన్‎రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‎మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సాఆర్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్, తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, మళ్లీ పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీజ్ ప్రారంభం కాగానే మళ్లీ డ్రైవ్ చేపట్టాలని, మార్చి 31 నాటికి అన్నిరోడ్లనూ మళ్లీ బాగు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏ మాత్రం ఉండకూడదన్నారు. గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలోనూ అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, సంబంధితశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories