అమలాపురం ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి అమలాపురం ఘటనల గురించి మాట్లాడారు. ఈ సమీక్షలో కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో 2022 మే నెలలో అమలాపురంలో జరిగిన ధర్నా హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రోడ్లపై వెళ్తున్న బస్సులకు నిప్పు పెట్టారు. అల్లర్లను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను రప్పించారు. ఈ అంశంపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. వందలాది మందిపై ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులను ఉపసంహరణ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.