బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రిపై కేసు

బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన పై రాయ్‌పూర్‌లో కేసు నమోదైంది. అయితే తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పందిస్తూ ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను. మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్ చెప్పుకొచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని 86 ఏళ్ల మా నాన్న కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని సమాజాలను గౌరవిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిస్తామని.. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మా నాన్న చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించాయని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆయన వ్యాఖ్యల పట్ల నేను కూడా బాధపడుతున్నానని భూపేశ్ బాఘేల్ చెప్పుకొచ్చారు.
నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులను విదేశీయులు అని.. వారిని బహిష్కరించాలని నంద్ కుమార్ బాఘేల్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సంస్థ తన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్ కుమార్ బాఘేల్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని పోలీసులకు తెలిపింది. ఆయనపై చర్చలు తీసుకోవాలని కోరింది. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు.
BRAHMANULU / HINDUVULU EKKADA VIMARSIMPA BADATAARO అక్కడ LAW AND ORDER POSITION లేనట్లే… అక్కడ బ్రాహ్మణులూ అడుక్కుంటున్నారు అనుకోండి…. అక్కడ LAW AND ORDER POSITION కూడా అడుక్కుతేనే పొజిషన్ లో ఉన్నట్టే…