National

సీఎం గారూ.. ఇలా కొడుకును కూడా అధికారిక మీటింగ్ లో కూర్చొనివ్వొచ్చా..!

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. తన కుమారుడిని అధికారిక సమావేశాలకు హాజరుకావడానికి అనుమతించడంతో వివాదం మొదలైంది. గురువారం పంజాబ్ డిజిపి మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో అధికారిక సమావేశం జరుగుతున్న గదిలో తన కుమారుడిని కూర్చోవడానికి సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అనుమతించారు. ఇది పంజాబ్‌లో వివాదానికి దారితీసింది. చరణ్‌జిత్ సింగ్ కుమారుడు రిథమ్‌జిత్ సింగ్ కు అక్కడ ఏమి పనో అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు.

రాష్ట్ర భద్రతా వ్యవహారాలపై చన్నీ ఇటీవల డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోటాతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడ రిథమ్‌జిత్‌ సింగ్‌ సైతం పాల్గొన్నట్లు కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రితోపాటు అధికారులపై విమర్శలకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వని శర్మ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ‘మాజీ కేబినెట్ మంత్రిగా సీఎం చన్నీకి సమావేశాల నియమాలు, నిబంధనల గురించి తెలుసు. పరిపాలన గౌరవం, విశ్వసనీయతను ఆయన కాపాడాలి. మరోవైపు సీనియర్‌ అధికారులూ ముఖ్యమంత్రి కుమారుడిని ఉన్నత స్థాయి సమావేశానికి అనుమతించడం దురదృష్టకరం’ అని విమర్శలు గుప్పించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రి కుటుంబంలోని ఎవరైనా అధికారిక సమావేశంలో పాల్గొనడం రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార నియమాలను ఉల్లంఘిస్తుంది. అటువంటి సమావేశాలలో చర్చించిన సున్నితమైన అంశాల విషయంలో అధికారిక రహస్యాల చట్టాన్ని కూడా ఇది ఉల్లంఘించవచ్చని నిపుణులు తెలిపారు. ఇది అసాధారణమైన విషయమని.. ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి అనధికార లేదా ప్రైవేట్ వ్యక్తి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని తెలియదా అని ప్రశ్నించారు. ఇది సీఎం చేసిన ప్రమాణానికి కూడా విరుద్ధమని పలువురు చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

four + 3 =

Back to top button