Telugu States

నూతన న్యాయస్థాన భవనాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ

విజయవాడలో నూతన న్యాయస్థాన భవనాలను సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో G+7 భవనాలు నిర్మించారు. వీటిలో 29 ఏసీ కోర్టు హాళ్లు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, ఏడు లిఫ్టులు సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన భవనాలను నిర్మించారు.

ఈ కార్యక్రమానికి ముందు విజయవాడ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణను సీఎం జగన్ కుటుంబ సమేతంగా కలిశారు. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న జస్టిస్ రమణను భార్య భారతితో కలిసి సీఎం జగన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొంటారు.

Related Articles

Back to top button