సీబీఐ కొత్త డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్‌

0
665

సీబీఐ కొత్త డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్‌ నియమితులయ్యారు. 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి సిఐఎస్ఎఫ్ చీఫ్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ ను సీబీఐ కొత్త డైరెక్టర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సీబీఐ కొత్త డైరెక్టర్ పోస్టు కోసం షార్ట్ లిస్ట్ చేసిన అధికారుల్లో ఈయనే సీనియర్ కావడంతో ఈ పదవి ఆయనకు దక్కింది. మొత్తం 109 మందిని వడపోసిన త్రిసభ్య కమిటీ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది లతో సుబోధ్ కుమార్ జైస్వాల్ రేసులో నిలిచారు. సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే సీబీఐ పనిచేస్తోంది. సీబీఐ డైరెక్టర్ గా వివాద రహితుడు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకోసమే సుబోధ్ కుమార్ జైస్వాల్ పై మొగ్గు చూపించింది. జనవరి 2021న సుబోధ్ జైస్వాల్ కు సెంట్రల్ డిప్యుటేషన్ వచ్చింది. మహారాష్ట్ర డీజీ నుండి సిఐఎస్ఎఫ్ బాధ్యతలను చేపట్టారు. అంతకు ముందు మహారాష్ట్ర పోలీసు విభాగంలో రెండేళ్లు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 2019 నుండి జనవరి 2021 వరకూ ఆయన మహారాష్ట్ర డీజీపీగా ఉన్నారు. కేబినెట్ కమిటీ సూచనల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ను నియమించారని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ తెలిపింది.

ఎవరీ సుబోధ్ జైస్వాల్:

సుబోధ్ జైస్వాల్ 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ చీఫ్ గా ఉన్నారు.

ముంబై పోలీసు కమీషనర్ గానూ, మహారాష్ట్ర డీజీపీ గానూ విధులు నిర్వర్తించారు. ముంబై పోలీసు కమీషనర్ గా 2018లో నియమితులు అయ్యారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ తో కలిసి పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్.పి.జి.), రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) లో కూడా విధులు నిర్వర్తించారు.

‘అబ్దుల్ కరీమ్ తెల్గీ’ 20000 కోట్ల ఫేక్ స్టాంప్ పేపర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఈయనే లీడ్ చేశారు.

2006 మాలేగావ్ బ్లాస్ట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన టీమ్ లో సభ్యుడు.

2009 లో సుబోధ్ జైస్వాల్ రాష్ట్రపతి నుండి పోలీసు మెడల్ ను అందుకున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here