National

సిఐడి అధికారిని కాల్చి చంపిన తీవ్రవాదులు

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) కు చెందిన ఒక పోలీసు అధికారిని శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది. స్థానిక మసీదులో సాయంత్రం ప్రార్థనల కోసం వెళుతున్నప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు సదరు పోలీసుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మృతుడైన పోలీసును పర్వేజ్ అహ్మద్ దార్ గా గుర్తించారు. తీవ్ర బుల్లెట్‌ గాయాలైన అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. ఇద్దరు ఉగ్రవాదులు సిఐడి ఇన్‌స్పెక్టర్‌ను పిస్టల్‌తో చంపారని పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటలకు, ఇద్దరు గుర్తుతెలియని (ఉగ్రవాదులు) వ్యక్తులు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పై స్థానిక మసీదు ముందు ప్రార్థన కోసం వెళుతుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సిసిటివి ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ కాల్పులకు తెగబడ్డ వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టామని.. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతోందని అన్నారు.

దార్ హత్యను జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఖండించారు. నౌగామ్‌లోని మసీదు బయట ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన ఇన్‌స్పెక్టర్ శ్రీ పర్వైజ్ అహ్మద్ దార్‌ను దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. అతని అత్యున్నత త్యాగం ఎప్పటికీ గుర్తు ఉంటుందని.. ఉగ్రవాదులు ఈ చర్యకు శిక్షించబడతారని అన్నారు. అమరవీరుడి కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం అని సిన్హా కార్యాలయం ట్వీట్ చేసింది. చనిపోయిన దార్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 15 =

Back to top button