More

    గోడౌన్ ను అద్దెకు తీసుకుని చర్చ్ నడుపుతూ మత మార్పిడులు.. ప్రజలకు తెలియడంతో

    ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గోడౌన్‌ను అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా చర్చి నిర్వహిస్తున్నారు. చర్చి నిర్వహిస్తూనే అక్కడ మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ మత మార్పిడులు ఆపమని అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. స్థానికులు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన ప్రదర్శనలు చేశారు. విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చర్చ్ నిర్వాహకులలో మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత విడుదల చేశారు.

    ద్వారకా జిల్లాలోని బిందాపూర్ ప్రాంతంలో ఒక గ్రామానికి ఆనుకుని ఉంది. అక్కడ ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడే ఉన్న గోడౌన్ లో చర్చి నడుస్తోంది. అక్కడికి వెళ్లిన కొందరు స్థానికులు ఇంతకూ ఏమి జరుగుతోందని ప్రశ్నించారు. మరికొందరు స్థానికులు, భజరంగదళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి చర్చి గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ సమయంలో చర్చి లోపల చాలా మంది ఉన్నారు. ఈ ఘటన తర్వాత చర్చిని ప్రస్తుతానికి మూసివేశారు. ఇద్దరు పోలీసులను అక్కడ మోహరించారు.

    గోడౌన్ ను మాయమాటలు చెప్పి అద్దెకు తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ చర్చి పేరుతో మతమార్పిడి చాలా రోజులుగా సాగుతోంది. చికిత్స పేరుతో వికలాంగ పిల్లలను అక్కడే ఉంచారు. అక్కడ హిందువులను మతం మారుస్తున్నారని స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందుగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయగా, తర్వాత భజరంగ్ దళ్ కు కూడా సమాచారం అందించారు. ఈ మత మార్పిడులను ఆపాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు కోరుతూ ఉన్నారు. గోడౌన్ లో అంత సైలెంట్ గా చర్చి నిర్వహించాల్సిన అవసరం ఏముందని భజరంగ్ దళ్ నాయకులు ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories