More

    చర్చ్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్న పాస్టర్.. అడ్డంగా దొరికిపోయే

    చర్చి అని చెబుతూ సెక్స్ రాకెట్టు నడుపుతున్నందుకు లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ అనే పాస్టర్, నలుగురు మహిళలతో సహా ఏడుగురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారి జిల్లాలోని ఎస్టీ మంగడులోని జ్యోతి నగర్ వద్ద ఉన్న ‘క్రైస్ట్ ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా’తో అనుబంధంగా ఉన్న ‘ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా’ లో బుధవారం నాడు తమిళనాడు పోలీసులు రైడ్ చేశారు. లగ్జరీ కార్లలో చర్చి ప్రాంగణానికి అనేక మంది పురుషులు మరియు మహిళలు తరచూ వస్తుంటారని పోలీసులకు సమాచారం అందింది.

    ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా కన్యాకుమారి ప్రాంతంలోని అతిపెద్ద చర్చిలలో ఒకటి. బిషప్ లాల్ ఎన్ ఎస్ షైన్ సింగ్ ఈ చర్చి స్థాపకుడు అధ్యక్షుడు. ప్రాధమిక దర్యాప్తులో చర్చి అధికారులు వేశ్యాగృహం నడపడానికి ఈ ప్రాంగణాన్ని ఉపయోగించారని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు చర్చి ప్రాంగణంపై దాడి చేసి, అనేక మంది మహిళలు, పురుషులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

    అరెస్టయిన ఆడవాళ్ళలో 19 ఏళ్ల యువతి కూడా ఉంది. తన తల్లి చేత బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడినట్లు తెలుస్తోంది. నలుగురు మహిళలతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాస్టర్ లాల్ ఎన్ ఎస్ షైన్ సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో పాస్టర్ లాల్ షైన్ సింగ్, షిబిన్ అనే మరో వ్యక్తి సెక్స్ రాకెట్టులో భాగం ఉన్నట్లు అంగీకరించారు. తమిళనాడు పోలీసులు పాస్టర్ మరియు మరో ఆరుగురిపై నితిరవిలై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories