తిరుపతి వైసీపీ అభ్యర్థి క్రైస్తవుడా?

0
691

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోన్నట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన గురుమూర్తి అనే క్యాండిడేట్ అసలు షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదని, అతను మతం మారిన క్రైస్తవుడని…, అతను చర్చిలో ప్రార్థనలు నిర్వహించి .ఫాదర్ ఆశ్సీసులు తీసుకున్న తర్వాతనే నామినేషన్ వేశాడని తెలస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా పాస్టర్ ఆఫ్ హోలీ చర్చ్ గూడూరుకు చెందిన.. రెవరండ్ అభిలాష్, బిషప్ ఎంజే ప్రదీప్ లు తమ ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టులు చేశారని బీజేపీ ఏపీ ఇంచార్జ్  సునీల్ దేవ్ ధర్ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

వైసీపీ అభ్యర్థులు చర్చి ఫాదర్ తో ఉన్న చిత్రాలను సైతం ఆయన పోస్టు చేశారు. షెడ్యూల్ కులాలకు కోసం రిజర్వ్ చేసిన స్థానం నుంచి ఓ క్రైస్తువుడు ఎలా పోటీ చేస్తాడని, తప్పుడు కుల ధృవపత్రంతో పోటీకి దిగడాని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు.

తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో ఒక క్రైస్తవుడిని, అతని మతాన్ని దాచిపెట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తోందని ఇది తెలుగు ప్రజలను మోసం చేయడమేని సునీల్ దియోధర్ ఆగ్రహించారు. 

సునీల్ దియోధర్ చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిన క్రైస్తవ ఫాదర్లు… వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తమ వద్దకు వచ్చి ప్రార్థనలు చేసి తమ ఆశీస్సులు తీసుకున్నారంటూ చేసిన ఫేస్ బుక్ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం, విగ్రహాలను విధ్వంసం చేయడం, జాతర్లో దేవతామూర్తులను ఊరేగించే రథాలను తగులబెట్టడం వంటి ఘటనలు అనేకం జరిగాయి.

అలాగే ఇప్పుడు టీటీడీలో అన్యమత ఉద్యోగస్థుల అంశంమరోసారి తెరపైకి వచ్చింది. జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ మతమార్పిడి కార్యక్రమాలు, దేవాలయాల భూములను ఆక్రమించి చర్చిలు కడుతున్నారంటూ ఏపీకి చెందిన సాధుసమాజం కూడా ఆరోపిస్తోంది.

టీటీడీ ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి ప్రాధాన్యం ఉంటుందని, అయితే ఆ ఎంపీ అన్యమతానికి చెందిన వ్యక్తి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని…, హిందువులందరూ తమ వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టి హిందూ ధర్మరక్షణ కోసం ఆలోచించాలని.. ధర్మాన్ని కాపాడే పార్టీకే ఓటు వేసి గెలిపించాలని సాధు సంతులు కోరుతున్నారు.   

Leave A Reply

Please enter your comment!
Please enter your name here