More

    ఆలయం లోకి చెప్పులు వేసుకొని వచ్చిన క్రిస్టియన్ డాక్టర్.. వ్యాక్సిన్ వేయించుకోమన్న గ్రామస్తులు

    తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని పోగోయ్ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే వ్యాక్సినేషన్ టీమ్ లోని ఓ క్రిస్టియన్ డాక్టర్ మాత్రం చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేసింది. ఆమెను చెప్పులు తీసేయండని ఇతరులు అడిగినా కూడా ఆమె ఆ పని చేయకుండా ఆలయ ప్రాంగణంలో కూర్చొంది. దీంతో గ్రామస్తులు వ్యాక్సినేషన్ వేయించుకోడానికి నిరాకరించారు. ఆమె బయటకు వెళ్ళిపోవాలి.. లేదంటే చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్లను వేయించుకుంటామని గ్రామస్తులు కూర్చున్నారు.

    తమిళనాడులోని వెల్లూరులోని పోగోయ్ గ్రామంలో ఒక క్రిస్టియన్ డాక్టర్ తన పాదరక్షలను ఆలయం లోపల ధరించడంతో వివాదం మొదలైంది. గ్రామస్తులకు వ్యాక్సిన్లను అందించడానికి గ్రామానికి వెళ్లిన బృందంలో సదరు డాక్టర్ కూడా ఒక భాగమే..! ఆమెను పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ పాదరక్షలు తీయడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిరసన తెలియజేశారు. పోగోయ్ గ్రామంలోని ముత్తాలమ్మన్ దేవాలయ ప్రాంగణంలో వేలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో పనిచేసే క్రిస్టియన్ డాక్టర్ రెజీనా గ్రామస్తులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి పంపిన బృందంలో ఉంది. దేవాలయం లోపల శిబిరం జరుగుతుండడంతో మిగతా ఆరోగ్య కార్యకర్తలందరూ తమ పాదరక్షలను తొలగించారు. రెజీనా మాత్రం ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గౌరవించలేదు. తన పాదరక్షలతో గర్భగుడి ముందు కూర్చుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పాదరక్షలను వదిలి రమ్మని గ్రామస్తులు ఆమెను అడిగినప్పుడు ఆమె “దేవాలయం లోపల పాదరక్షలు ధరించరాదని బోర్డు ఉందా?” అని ప్రశ్నించిందట..! పదేపదే అభ్యర్థించినప్పటికీ రెజీనా తన పాదరక్షలను తీసివేయడానికి నిరాకరించింది. గ్రామస్తులు ఆమె ఆలయం నుండి బయటకు వెళ్ళితే కానీ టీకా తీసుకోమని చెప్పారు.

    The doctor from Vellore Govt Hospital reportedly refused to remove her footwear inside the temple

    తాను చేసిన పనిని సమర్థించుకున్న డాక్టర్:

    డాక్టర్ రెజీనా తాను చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. విషయం గురించి తెలుసుకున్న హిందూ ఫ్రంట్ నాయకుడు ఆది శివ తన మద్దతుదారులతో ఆలయానికి వచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని మరియు ఆమె పాదరక్షలను తీసివేయాలని అతను డాక్టర్‌ను అభ్యర్థించినా ఆమె వినలేదు. చెప్పులు లేకుండానే వెళ్లితే కోవిడ్ బారిన పడుతుందనే భయంతో తాను ఈ పని చేసినట్లుగా రెజీనా వెల్లడించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆమె వివరణను పట్టించుకోలేదు.. ఆమె వెంటనే ఆలయ ప్రాంగణాన్ని విడిచిపెట్టాలని పట్టుబట్టారు. ఆమె వెళ్లిన తర్వాత మాత్రమే తాము టీకాలు తీసుకుంటామని గ్రామస్తులు గట్టిగా చెప్పారు.గ్రామస్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు డాక్టర్‌తో పాటు వచ్చిన నర్సులు డాక్టర్ తరపున క్షమాపణలు చెప్పారు.

    Trending Stories

    Related Stories