వెస్టిండీస్ క్రికెటర్లు సర్ వివియన్ రిచర్డ్స్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తమ దేశం జమైకాకు కరోనా వ్యాక్సిన్ అందించినందుకు వెస్టిండీస్ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. ఆ వీడియోను జమైకాలోని భారత హై కమిషన్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
భారత హై కమిషనర్ ఆర్ మసాకుయ్‌ను కలిసిన గేల్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫొటోలను షేర్ చేశారు. త్వరలోనే తాను భారత్‌కు వస్తానని, కలుస్తానని చెప్పారు. మార్చి 11న ఆంటిగ్వా, బార్బుడా, జమైకాలకి 20వేల కరోనా వ్యాక్సిన్ డోసులను భారత్ పంపింది. వ్యాక్సిన్ మైత్రి పేరిట కరోనా మహమ్మారి బారినపడి బాధపడుతున్న పలు దేశాలకు భారత్ వ్యాక్సిన్లను అందజేస్తోంది.
వెస్టిండీస్ క్రికెటర్లు సర్ వివియన్ రిచర్డ్స్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంటిగ్వా, బర్బూడాల తరపున తాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను ఎంతో ఉదారంగా అందజేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించినందుకు ఆంటిగ్వా క్రికెటర్ జిమ్మీ ఆడమ్స్ భారత్‌కు రుణపడి ఉంటామని తెలిపారు.