More

    ఆసుపత్రి పాలైన విక్రమ్..

    ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చియాన్ విక్రమ్‌కు గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. జూలై 7న యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా టీజర్ లాంచ్‌కి ఆయన హాజరు కావాల్సి ఉంది. చియాన్ విక్రమ్ నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న థియేటర్లలోకి రానుంది.

    ఈరోజు ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. త్వరలో మెడికల్ బులెటిన్ వెలువడే అవకాశం ఉంది. ఈరోజు టీజర్ లాంచ్‌కు తాను హాజరు కావడం లేదని విక్రమ్ గురువారం పొన్నియిన్ సెల్వన్ టీమ్‌కి తెలియజేశాడు. కొన్ని రోజుల పాటూ విక్రమ్ విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే జూలై 11, సోమవారం జరగనున్న ‘కోబ్రా’ సినిమా ఆడియో లాంచ్‌కు హాజరవుతారు.

    Related Stories