Telugu States

తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మెగా స్టార్ చిరంజీవి

తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి లోని రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోయిన వార్త ప్రజలకు కన్నీరు తెప్పించింది. ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇకపై అలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు మెగా స్టార్ చిరంజీవి సంకల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఓ వైపు కరోనా కష్ట కాలంలో ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్న చిరంజీవి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ కూడా తోడుగా నిలిచాడు. సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే ఉద్దేశ్యంతో 1998లోనే బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ తర్వాత ఐ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదనే ఉద్దేశ్యంతో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని మెగా స్టార్ చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అందుకు సంబంధించిన బాధ్యతలను మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్ క్లబ్స్ చూసుకుంటూ ఉన్నాయి.

ఈ విషయాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇంకో వారం రోజుల్లో ఆక్సిజన్ బ్యాంకులు పని చేయబోతున్నాయని తెలిపారు. చిరంజీవి చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న వారి కోసం తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ వెళుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారికి, సినీ జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్లు వేయిస్తానని మాట కూడా ఇచ్చారు. ఎంతో మంది పేద కళాకారులకు గత ఏడాది లాక్ డౌన్ సమయంలో సహాయాన్ని అందించారు.

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల తన పరిస్థితిని వివరించగా.. ఆమెకు చిరంజీవి తన వంతు సహాయం అందించారు. రూ.1,01,500 మొత్తానికి చెక్కును తన ప్రతినిధుల ద్వారా ఆమెకు పంపించారు. ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఇప్పించనున్నారు. ‘మా’లో సభ్యత్వం వల్ల ఇక ఆమెకు ప్రతి నెలా అసోసియేషన్ నుంచి రూ.6000 పెన్షన్ లభిస్తుంది. చిరంజీవి చేసిన సహాయానికి పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ తనకు చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం చేశారని ఆమె చెప్పారు. తనకు ఇంతటి సహాయం చేసిన చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పారు.

చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మరణించడం చిరంజీవిని తీవ్రంగా కలచి వేసింది.తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు. ఇలా ఎన్నో మంచి పనులను చిరంజీవి చేసుకుంటూ వెళుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 3 =

Back to top button