కేంద్ర మంత్రి అమిత్ షాను మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిశారు. ఆస్కార్ అవార్డ్స్ కోసం అమెరికాకు వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి గత రాత్రి ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షాను కలిశారు. తొలుత చిరంజీవి, రామ్‌చరణ్ ఇద్దరూ మంత్రికి శాలువాలు కప్పి సత్కరించగా, అనంతరం రామ్ చరణ్‌కు అమిత్ షా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కాసేపు ముగ్గురు ముచ్చటించుకున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే చానల్ నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొన్నారు.
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఓరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది. కీరవాణి చంద్రబోస్,ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా హైదరాబాద్ కు మార్చి 17న తిరిగి వచ్చింది. రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో దిగాడు. RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు అంటూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.