More

    ఇదంతా ప్రత్యర్థుల నీచపు ప్రచారం: చింతమనేని ప్రభాకర్

    కోడి పందేల కేసులో తన పేరు వినిపించడాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖండించారు. హైదరాబాద్ శివారులో కోడి పందేల స్థావరంపై పోలీసులు జరిపిన దాడుల్లో తప్పించుకుని పారిపోయారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. ‘కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపడం మీ జెండా అజెండా. ఇంత రాక్షస రాజకీయం అవసరమా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఈ నీచపు ప్రచారంతోనే కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైంది. మీ అసత్యాలు ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీ రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలోనే. మీ చింతమనేని ప్రభాకర్.’ అంటూ హెచ్చరించారు చింతమనేని.

    పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం కోడిపందేల కేంద్రం పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలలో దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 252 లో 25 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలో కోళ్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా దాడి చేశామని అన్నారు. కోడి పందేల స్థావరంపై దాడులు జరిపి 21 మందిని అరెస్ట్ చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories