ఇమ్రాన్ ఖాన్, రాజపక్స బాటలోనే జిన్ పింగ్..?

0
715

డ్రాగన్ దేశాధ్యక్షుడికి మూడిందా..? ఇమ్రాన్ ఖాన్, రాజపక్సకు పట్టిన గతే పడుతుందా..? జిన్ పింగ్ కు పదవి గండం తప్పదా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

కోవిడ్‌19 నివార‌ణ‌లో చైనా దారుణంగా విఫ‌ల‌మైంది. తాజాగా విధిస్తున్న లాక్‌డౌన్లతో ఆ దేశ ప్ర‌జ‌ల్లో తీవ్ర అస‌హ‌నం ఉంది. కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ విఫ‌ల‌మైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌స్తుతం చైనీస్ సోష‌ల్ మీడియాల్లో తీవ్ర స్థాయిలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. లాక్‌డౌన్ల వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ‌తిన్న‌ద‌ని, అందుకే జిన్‌పింగ్ త‌న ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న‌ట్లు రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

చైనా పార్టీ పొలిట్‌బ్యూర్ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింది. ఆ భేటీ త‌ర్వాత జిన్‌పింగ్ త‌ప్పుకుంటున్న‌ట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. జిన్‌పింగ్‌పై కెన‌డా దేశానికి చెందిన ఓ బ్లాగ‌ర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం చైనాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. చైనీస్ క‌మ్యూనిస్టు పార్టీ నుంచి జిన్‌పింగ్‌ను ప‌క్క‌న‌పెట్ట‌నున్న‌ట్లు ఆ బ్లాగ‌ర్ త‌న వీడియోలో పేర్కొన్నారు. జిన్‌పింగ్ స్థానంలో ప్ర‌స్తుత ప్ర‌ధాని లీ కీక్వాంగ్ ఆ బాధ్య‌త‌లు చేప‌డుతార‌ని తెలిపారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని లీ కీక్వాంగ్ న‌డ‌పనున్న‌ట్లు ఆ వీడియోలో వెల్ల‌డించారు.

కోవిడ్19 జీరో పాల‌సీలో భాగంగా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ క‌ఠిన ఆంక్ష‌ల‌కు ఆదేశించారు. అయితే అతిగా లాక్‌డౌన్లు విధించ‌డం వ‌ల్ల దేశ వ్యాపార సంస్థ‌లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఆర్థిక‌, సామాజిక వృద్ధికి మ‌హ‌మ్మారి అడ్డుగా నిలుస్తోంద‌ని ఓ చైనా అధికారి తెలిపారు. క‌మ్యూనిస్టు పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ డిప్యూటీ డైరక్ట‌ర్ హ‌న్ వెన్‌జియూ మీడియాతో మాట్లాడుతూ శాస్త్రీయ ప‌ద్ధతిలో మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాల‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించాల‌ని, ఒకే ర‌క‌మైన టార్గెట్ ఉండ‌కూడ‌ద‌ని నఅన్నారు. క‌ఠిన కోవిడ్ ఆంక్ష‌ల వ‌ల్ల ప‌రిశ్ర‌మల ఉత్ప‌త్తి త‌గ్గింద‌ని, దీంతో స‌ప్ల‌య్ చెయిన్ దెబ్బ‌తిన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. త‌యారీరంగ ప‌రిశ్ర‌మ‌లు క్షీణిస్తున్నాయ‌ని, 2020 ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత కంపెనీలు డీలాప‌డ్డ‌ట్లు భావిస్తున్నారు.

షాంఘైలో లాక్‌డౌన్లు పొడిగించ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు కూడా త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో చైనా క‌రెన్సీ విలువ 4 శాతం త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన 28 ఏళ్ల‌లో ఇంత‌గా ప‌డిపోవ‌డం ఇదే మొద‌టిసారి. స్టాక్ మార్కెట్లు కూడా పేల‌వంగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల చైనా ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. దీంతో జిన్‌పింగ్ పాల‌న‌పై జ‌నం న‌మ్మ‌కం కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో జిన్‌పింగ్ అధ్యక్ష‌ బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here