Special Stories

చైనా ఆర్మీలో టిబెటన్లు..!
భారత సరిహద్దుల్లో భారీ కుట్ర..!!

అడుగడుగునా చైనా కుట్రలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో ఇప్పటికే పలుమార్లు భారత సైన్యం చేతిలో భంగపడింది. గల్వాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలు చైనా సైన్యం బలహీనతలు బయటపడ్డాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో పోరాడేంత శక్తి సామర్థ్యాలు డ్రాగన్ సైన్యానికి లేవని ప్రపంచానికి తెలిసిపోయింది. కొన్నేళ్లుగా దౌత్యపరంగాను భారత్‎దే పైచేయి అవుతోంది. దీంతో తీవ్ర అక్కసు రగిలిపోతున్న డ్రాగన్.. కొత్త కొత్త కుట్రలకు తెరతీస్తోంది. భారత్‎పై ఉసిగొల్పేందుకు టిబెట్‎లోని స్థానిక యువకులను పావుగా వాడుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులను టార్గెట్ చేసి.. వారి జీవితాలను ఫణంగా పెడుతూ బలవంతంగా ఆర్మీలో చేర్చుకుంటోంది.

గల్వాన్‌, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాల్లో కీలక మార్పులు చేస్తోంది డ్రాగన్. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది. అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్‌ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి. భారత సైనికులు ఈ ప్రాంత వాతావరణానికి తేలికగా అలవాటు పడతారు. మన దళాలు పలు పర్వత ప్రాంతాల్లో నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ, హిమాలయ పర్వతప్రాంతాల్లో పనిచేసేందుకు.. చైనా సైనికుల శక్తి సామర్థ్యాలు సరిపోవు. దీంతో భారత సైనికులతో పోరాడేందుకు.. టిబెట్ యువకుల ప్రాణాలను ఫణంగా పెడుతూ.. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది.

టిబెట్ భౌగోలిక ప్రాంతం కూడా హిమాలయాలో కూడినదే కాబట్టి.. అక్కడి వారికి పర్వతప్రాంత వాతావరణం అలవాటే. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యంతో తలపడేందుకు టిబెటన్లతో ‘వాలంటరీ మిలీషీయా’ను ఏర్పాటు చేస్తోంది. సైన్యంలో చేర్చుకున్న టిబెటన్ యువకులను ముఖ్యంగా.. సిక్కిం సరిహద్దుల్లో మోహరిస్తున్నట్టు నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చైనా కొత్త వ్యూహంపై భారత్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే, ఓ కన్నేసి ఉంచాలని సైనిక, అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.

లద్దాక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ల వెంబడి.. 3,488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును చైనాతో భారత్ పంచుకుంటోంది. అంతర్జాతీయ నిపుణుల వెల్లడించిన సమాచారం ప్రకారం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో పాటు.. అక్కడి పోలీసు యంత్రాంగం కూడా టిబెట్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సిక్కింకు దగ్గరగా వున్న యాంగ్ డాంగ్ నుంచే ఎక్కువ నియామకాలు జరుగుతున్నట్టు సమాచారం. నియామక ప్రక్రియ పూర్తికాగానే.. వారిని శిక్షణ కోసం పీఎల్ సెంటర్లు, చైనా పోలీసు విభాగాల్లోకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. శిక్షణ పూర్తికాగానే వారిని.. చెక్ పోస్టులు, ఇమ్మిగ్రేషన్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో నియమిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరిని చైనా సైన్యంలో వినియోగించేందుకు ప్లాన్ చేసింది డ్రాగన్. ఇందులో భాగంగా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టిబెట్ రీజియన్ లో గత ఏప్రిల్ నుంచి భారీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లు నిర్వహిస్తోంది చైనా. అయితే, డ్రాగన్ కొత్త ఎత్తుగడలను భారత నిఘావర్గాలు సునిశితంగా గమనిస్తున్నాయి.

ఓవైపు ఇలా టిబెటన్లను సైన్యంలో చేర్చుకుంటూనే.. మరోవైపు సరిహద్దుల వెంబడి కొత్త నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్. ఇటీవల ఎల్ఏసీ వెంబడి నిర్మాణాలకు సంబంధించి భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. టిబెట్‌, జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులలో తన సైనిక కార్యకలాపాల్లో చైనా వేగం పెంచింది. ముఖ్యంగా భారత సరిహద్దు అయిన ఎల్ఏసీ వెంట పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ కదలికలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి.

ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఉపయోగించుకునేలా కంబైన్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతోంది చైనా మిలిటరీ. సరిహద్దు వెంట తన బలాన్ని పెంచుకునే పనిలో భాగంగా చైనా ఈ నిర్మాణాలు చేస్తోందని భారత్‌ ఆర్మీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌ డిఫెన్స్‌తో పాటు మిస్సైల్స్‌ పొజిషనింగ్‌, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలను చైనా చేపడుతోంది. పీఎల్‌ఏలో వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఎల్‌ఏసీ వెంట భద్రత విధులను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం వెస్ట్రన్‌ థియేటర్‌కి సంబంధించి పది యూనిట్లు ఎల్‌ఏసీ వెంట చురుగ్గా ఉన్నట్టు సమాచారం. కంబైన్డ్‌ ఆర్మీ, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి సహకారం అందిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు చైనా ఎయిర్‌ఫోర్స్‌ గమనిస్తోంది. గతేడాది నుంచి తూర్పు లద్ధాక్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈసారి చైనీస్ ఆర్మీతో పాటు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగింది. ఈ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని భారత ఆర్మీ వర్గాలు స్పష్ట.

గత సంవత్సరం యావత్ ప్రపంచం ఓ వైపు కరోనాతో పోరాడుతుంటే.. చైనీస్ మిలిటరీ భారత్ భూభాగంపై కన్నేసింది. లద్ధాక్ సమీపంలోని ఇండో-చైనీస్ బోర్డర్‌ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది డ్రాగన్ ఆర్మీ. ఆ భూభాగం తమదేనని చెప్పుకునేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. అయితే, భారత సైన్యం చైనీస్ కుట్రలను తిప్పికొట్టింది. మన భూభాగం నుంచి డ్రాగన్ ఆర్మీని తరిమి కొట్టింది. అదే సమయంలో భారత దౌత్య పర్యంగాను చైనీస్ పాలకులపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు మూడు, నాలుగు నెలల తర్వాత చైనా మిలిటరీ తమ భూభాగానికి తిరిగి వెళ్ళింది. ఇదంతా జరిగి తీరా ఆరేడు నెలలు గడవక ముందే డ్రాగన్ కంట్రీ మళ్లీ కుట్రలకు తెరలేపింది. భారత సైన్యంతో ప్రత్యక్ష పోరాటం చేయలేక ఇప్పుడు టిబెటన్ల జీవితాలను ఫణంగా పెడుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two + sixteen =

Back to top button