More

  ‘EMPTY FORTRESS’ స్ట్రాటజీ..!
  ఆసియా ఆక్రమణకు చైనా ఎత్తులు

  వర్తమాన భారత రాజకీయాల్లో ఇటీవల ఒక ప్రమాదకరమైన ధోరణి పద్ధతిప్రకారమే ప్రబలుతోంది. దేశీయమైన ఆలోచన-స్వతంత్ర ధోరణి-దేశీయ తాత్వికత ధ్వనించే రాజకీయం అనబడే మూడు ముఖ్య భావనలను ‘ఫాసిజం’ అని ప్రచారం చేయడమే ఈ ప్రమాదకర ధోరణి అని స్థూలంగా సూత్రీకరించవచ్చు. ఈ ప్రచార పర్వం వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర ఉంది.

  ‘ఫాసిజం’ అనే ఈ ఫార్స్ డ్రామాలో వాడుతున్న భాష అత్యంత నాగరికమైంది. నాజూకు భాషకు మూలం ‘‘Argumentative Democracy-manufacturing Consent అనే భావనలు. అంటే ‘చర్చకు అస్కారం కల్పించే ప్రజాస్వామ్యం-సమ్మతి సృష్టి. ఈ కుట్ర తెర వెనుక ఉన్నది చైనా అనబడే రచయిత. ఇది అభూత కల్పనకాదు. అత్యంత కఠోర సత్యం. ఇండియా చుట్టూ దౌత్య-సైనిక-ఆర్థిక దిగ్భంధం చేసి అంతర్గతంగా రాజకీయ కుట్ర వ్యూహాన్ని అనుసరిస్తోంది చైనా.

  పెట్రోల్ మొదలు పిప్పరమెంట్ వరకూ, వైరస్ నుంచి వ్యాక్సిన్ వరకూ ప్రతి అంశాన్ని అసమర్థతగా చూపించి లేని భూతాన్ని సృష్టించేందుకు జరుగుతున్న కుట్ర వెనుక డ్రాగన్ వ్యూహముంది. జాతీయవాదాన్ని బలిపెట్టే లక్ష్యం, సమగ్రతను సమాధి చేసే ప్రయత్నం, స్వతంత్రతకు చితిపేర్చే అంతర్జాతీయ కుట్ర ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ఈ రాజకీయ లక్ష్యాలను సాధించే ప్రణాళిక ఉంది. ప్రణాళికలో అంతర్జాతీయ స్థాయి మేధావులుగా చెలామణీ అవుతున్నవారు, టీవీ ఛానెళ్లూ, పత్రికాధిపతులు, నేతలూ ఉన్నారు.

  మనదేశ రాజకీయాలను చైనా ఎలా వాడుకుంటోంది? దానివల్ల చైనాకు వచ్చేదేంటి? ‘‘Argumentative Democracy-manufacturing Consent అనే భావనల మూలమేంటి? భారత్ చుట్టూతా ఉన్న దేశాల్లో చైనా బాహట ప్రవర్తన వల్ల వచ్చే ప్రమాదమేంటి? జాతీయవాదాన్నీ, దేశ సమగ్రతను, స్వతంత్ర వైఖరిని చంపడం వల్ల భారత్ కు ఏర్పడే ముప్పేంటి?

  ఈ ప్రశ్నలకు జవాబులనూ, ఈ కుట్రతాలూకు కథనూ వివరించే ప్రయత్నం చేస్తాను.

  అమెరికా కేంద్రంగా పనిచేసే యూనైటెడ్ నేషన్స్ ఇనిస్టిట్యూడ్ ఆఫ్ పీసీ సంస్థ గతేడాది డిసెంబర్ లో ‘‘China’s Influence on Conflict Dynamics in South Asia’’ అంటూ ఓ నివేదికను బయపెట్టింది. అందులో ‘‘China has embarked on a grand journey west. Officials in Beijing are driven by aspirations of leadership across their home continent of Asia. eight countries—Afghanistan, Bangladesh, Bhutan, India, Maldives, Nepal, Pakistan, and Sri Lanka—along with the Indian Ocean.’’ అంటే చుట్టూతా ఉన్న ఎనిమిది దేశాల్లో మంటపెట్టి, చక్రబంధంలో ఉంచి అంతర్గతంగా దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించి-ఆసియాఖండంపై ఆధిపత్యం సంపాదించడమన్నది డ్రాగన్ పకడ్బందీ కుట్ర.

  భారత చుట్టూతా ఉన్న ఈ ఎనమిది దేశాలు అంతర్గత సమస్యలతో-చైనా అప్పుల భారంతో బజారునపడ్డాయి. భారత్ కు ఈశాన్యంలో చైనా ప్రమాదం పొంచి ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే భారత్ ఏడేళ్లుగా సుదీర్ఘంగా వెంటాడుతున్న చారిత్రక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటోంది.

  స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. విధాన నిర్ణయాల రూపకల్పనలో, ఆచరణలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. వాటిని పట్టుకుని నానాయాగీ చేస్తూ దేశ సమగ్రతను ప్రమాదంలోకి నెట్టే భారీ రాజకీయ కుట్రకు కొనసాగింపే ఫాసిజం అనబడే డ్రాగన్ విరచిత నాటకం అసలు ఉద్దేశం.

  చైనా ఇప్పటికే ఆఫ్రికాఖండమంతటా విశాల వ్యాపారాన్ని సృష్టించుకున్నది. చైనా ఆసియా కుట్రలో భాగం పంచుకుంటున్నది మన దేశంలోని రాజకీయ-మేధో-మీడియా వర్గాలు. ఈ క్రూరమైన కుట్ర మూలంగానే 2019 ఎన్నికల తర్వాత ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారింది. ఇదంతా యథాలాపంగా చేస్తున్న ఆరోపణలు కావు. దీని వెనుక ఉద్దేశాలూ, వ్యూహాలూ ఉన్నాయి. ప్రపంచంలో మనకు మాత్రమే ఉన్న అరుదైన అంశం-మనదేశం పేరుతోనే ఉన్న హిందూ మహాసముద్రాన్ని చైనాకు ధారాదత్తం చేయడానికి మావోవారసులకు తొత్తులుగా మారి తమవంతు సాయం చేస్తున్నారు మన నేతలు.

  జాతీయవాదాన్ని ఫాసిజంగా, నియంతృత్వంగా ప్రచారం చేయడం ఇటీవలికాలంలో మరింత పెరిగేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ కుట్ర ఉందని అంతర్జాతీయ పత్రికలు వాస్తవ ఆధారిత కథనాలు రాస్తున్నాయి. కనీసం అంతర్జాతీయ అంశాల్లో కూడా మన ప్రతిపక్ష నేతలు జాతీయవాద వైఖరిని ప్రదర్శించకపోవడమే విడ్డూరం, విషాదం.

  కశ్మీర్ ఉగ్రవాదానికి ‘అజాదీ’ నినాదాన్ని జోడించి సమర్థించడం, పాక్ ను పొగడటం, భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలనీ పిలుపునివ్వడం, అరుణాచల్ అష్టదిగ్బంధం చేస్తామనడం, భూగోళాన్ని వైరస్ కలవర పెడుతుంటే చైనాను పల్లెత్తుమాటనకుండా ప్రభుత్వాన్ని నిందించడం, వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపితే అప్రజాస్వామికం అంటూ హక్కుల ఊసెత్తడం వెనుక అరాజకీయ నినాదాల కుట్ర చాలా పెద్దదే.

  మోదీగ్రాఫ్ పడిపోయిందంటే దాని అర్థం చైనా గ్రాఫ్ పెంచాలనే ఉద్దేశం. ఫాసిజం ప్రచారం వెనుక కమ్యూనిజాన్ని-కాంగ్రేస్ వాదాన్ని ప్రతిష్ఠించాలనే ఆకాంక్ష, జాతీయవాదాన్ని జియోనిజంగా అభివర్ణించడం వెనుక అవినీతిని అందలమెక్కించాలనే ఆతృత ఉంది.

  అయితే మొత్తం నాటకానికి ఆసక్తిని పెంచే భాషను, ప్రచారం ఉధృతం కావడానికి అవసరమైన సంరజామాను, నటులను పోలిన మేధావులను, బుద్ధిజీవులను పోలిన నాటక ప్రయోక్తలను సృష్టించుకుంది. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్-కమ్యూనిస్టులు నేరుగా ఏమిచెప్పినా వినే పరిస్థితి లేదు. కాబట్టి కుట్రకు కొత్త హంగులూ రంగులూవేసి యవనిక తెర పెకెత్తారు.

  గోరక్షకు మత అసహన ముద్రవేసిన సదరు మేధో బృందాలు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు ప్రచురించాయి. ట్రిపల్ తలాక్ రద్దు, 370 అధికరణం రదు, మక్కా సందర్శన సబ్సిడీ రద్దు లాంటి అత్యవసర విధాన నిర్ణయాలను వివాదంలోకి లాగాయి. పౌరసత్వ చట్టసవరణ అంశాన్ని ముస్లీం వ్యతిరేక చట్టమని ముద్రవేసి రాజధానిలో రణరంగం సృష్టించాయి. విశ్వవిద్యాలయాలను కుట్రలకు నిలయాలగా మార్చాయి. అన్నీ అయిపోయాక కరోనాను పట్టుకున్నాయి. వాక్సిన్ విషయంలో నానాహంగామా చేస్తున్నాయి. తాజా మోదీ గ్రాఫ్ గురించి చర్చను మొదలుపెట్టాయి.

  ఈ మొత్తం ఘటనలు-ఆరోపణల క్రమాన్ని నిశితంగా గమనిస్తే కుట్రసారం తెలుస్తుంది. మోదీని ముద్దాయిని చేసి, బీజేపీని శిక్షించి-అధికారాన్ని తిరిగి కాంగ్రెస్ చేతిలో పెట్టడం ఆ తర్వాత దేశాన్ని అవినీతిపాలు చేయడమనే దారుణమైన కుట్ర ఉంది. ఈలోపు సరిహద్దులు మారిపోతాయి. హిందూ మహాసముద్రం తూర్పుభాగంలో ఎర్రసైన్యం తిష్ఠవేస్తుంది. ఆసియా మొత్తం చైనా రుణగ్రస్థ ఆవరణగా మారుతుంది. ఇదీ అసలు వాస్తవం.

  కుతంత్రానికి పాత్రికేయాన్ని వాడుకున్నాయి మన ప్రతిపక్షాలు. ‘‘India needs serious China experts who can guide policy, not parachute commentators’’ అంటూ గతేడాది ది ప్రింట్ ఓ కథనాన్ని ప్రచురించింది. రిటైర్డ్ సైనికాధికారులు, ఇప్పటికీ పనిచేసినవారు నిపుణులు కాదని తేల్చింది. పైగా స్ట్రాటజిక్ ఇష్యూస్ లో, విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాల్లో ‘చైనా గురించి బాగా తెలిసిన నిపుణులు లేరంటూ వాపోయింది. భారత సరిహద్దు గురించి సరిహద్దుల్లో ఉండే సైన్యం చెప్పాలా, చైనా గురించి పుస్తకాలు చదివిని సోకాల్డ్ ఇంటలీజెన్షీయా చెప్పాలా?

  ఈ కథనంలో మరో వ్యాఖ్య చేసింది ‘‘Article 370 may be the trigger for LAC crisis. This is one of the rare occasions when Chinese are reacting to India’s attempts at challenging status quo.’’ ఆరోపణలు చేసింది. అంటే 370 అధికరణం రద్దు కారణంగానే సరిహద్దు వివాదం వచ్చి ఉండొచ్చనీ, భారత ప్రభుత్వం స్టాటస్ కోను ఛాలెంజ్ చేసిన కారణంగానే వివాదం వచ్చిందంటూ నిర్ధారించింది.

  పైగా ‘‘Argumentative Democracy’’ మృగ్యమైపోతోందని ముఖాన్ని చిట్లించింది. అంటే అన్ని అంశాల్లో అర్థంలేని అవాకులూ చవాకులకు ఆస్కారం ఇవ్వని కారణంగానే మోదీ నియంత అనీ, ప్రతిపక్షాలన్నీ ఒక వాతావరణాన్ని తయారు చేస్తున్నాయి. దీన్నే manufacturing Consent అంటే సమ్మతి సృష్టికోసం పథకం ప్రకారం పనిచేస్తున్నాయి.

  manufacturing Consent అనే భావనను ప్రచారంలోకి తెచ్చింది అమెరికా భాషావేత్త, అంతర్జాతీయ రాజకీయ నిపుణుడు నోమ్ చామ్ స్కీ. ఆ పేరుతోనే ఆయన మహా గంథం రాసి-ప్రపంచ రాజకీయాల గురించి తీర్మానాలు ప్రకటించారు. భాషా వేత్తగా చామ్ స్కీ పట్ల గౌరవాన్ని ప్రకటించవచ్చు.

  అంతేకానీ, ఆయన సమర్థించే ఆరచకవాద తాత్వికతను, manufacturing Consent అనే భావనల ప్రమాదాన్ని ఎలా అంగీకరంచగలం?

  ఏ అంశం చర్చకు వచ్చినా ఒకే నిర్ధారణను ప్రతిపాదించి అదే పనిగా ప్రచారం చేసి- సమ్మతిని సృష్టించడం ప్రమాదకరమైన పరిణామం. చోమ్ స్కీ manufacturing Consent గురించి వేరే సందర్భంలో చెప్పినా… మన మేధావులు మాత్రం దాన్ని కుట్రకోణంలోకి చేర్చారు.

  అంటే చైనా దురాక్రమణ తత్వం వల్ల సరిహద్దు వివాదం రాలేదు- 370 అధికరణం రద్దు వల్లనే వచ్చిందనడం, పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి కారణం కశ్మీర్ లో సైన్యం ఎన్ కౌంటర్ లే అనడం, ఈశాన్యంలో ప్రత్యేక సాయుధ దళాల చట్టం వల్ల అశాంతి అనడం, వైరస్ వల్ల కాదు వ్యాక్సిన్ కొరత వల్లనే మరణాలు పెరుగుతున్నాయనడం, పౌరసత్వ సవరణ చట్టం రద్దు ముస్లీంలను వెళ్లగొట్టేందుకే అనే వాదనా పద్ధతిని Upside Down glass థియరీ అంటాడు ఉరుగ్వే జర్నలిస్ట్ ఎడ్వర్డో గలియనో. అంటే విషయాన్ని తిరగేసి చూసి తప్పుడు వాదన చేయడం. తలకిందుల భంగిమలో ఉండి ఇతరులు సరిగ్గా లేరెందుకనడం లాంటి వాదనలన్నమాట.

  ఈ వాదన వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే-భారత ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజిక్ ఆపరేషన్స్-పాలసీ మేటర్ల విషయంలో విధాన నిర్ణయాలు చేయకూడదు-ఆయాదేశాల ముందు అనునయం ప్రకటించాలన్న కాంగ్రెస్ ఫిలాసఫీ అన్నమాట.

  చైనా భారత్ చుట్టుతా బలమైన వల అల్లుతోంది. వ్యూహాత్మక భూభాగాల్లో తన స్థావరాలను నెలకొల్పుతోంది. రేపుపట్టణాల్లో పాగా వేస్తోంది. ఇది మొత్తం సవ్యంగా జరిగితే ఏదో ఒక రోజు ఎర్రసైన్యం భారత సరిహద్దులను ఆక్రమించేస్తుంది. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భారత ప్రభుత్వం చేతులుడిగి కూర్చుంటుంది. ఇది ప్రస్తుత ‘ఫాసిజం’ నాటకం అసలు కుట్ర.

  వ్యూహాత్మ అంశాల్లో, వివాదిత భూభాగాల విషయంలో, సముద్ర వాణిజ్యం, విదేశాంగ విధానం, దౌత్య రంగాల్లో స్వతంత్ర వైఖరి ప్రదర్శించే ప్రభుత్వం, సాహసం ప్రదర్శించే గౌరవప్రదమైన ప్రధాని ఉండకూడదని చైనా భావిస్తోంది. దాన్ని ఓడించేందుకు ఈ తతంగమంతా చేస్తోంది. ఇది సీపీసీ ఆసియా వ్యూహంలో భాగం. మిషన్-2024 పోల్స్ అనేది మన ప్రతిపక్షాల లక్ష్యం. భారతదేశంలోని ప్రతిపక్షాల వైఖరిని నిరంతరం తెలుసుకునే చైనా కమ్యూనిస్టు పార్టీ వాటిని పరోక్షంగా దువ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగమే ఈ కుట్ర.

  నెక్ట్స్ ఎపిసోడ్‎లో.. South and Central Asiaలో చైనా అనురించబోయే ‘‘Empty Fortress’’ వ్యూహం గురించీ- దీనిలో ముఖ్యంగా పాక్, ఆఫ్ఘనిస్తాన్ ల పాత్ర గురించి తెలుసుకుందాం. Empty Fortress వ్యూహాన్ని రివర్స్ సైకాలజీ వ్యూహంగా పిలుస్తారు. మాటువేసి, మభ్యపెట్టి కబళించడం అన్నమాట.

  Trending Stories

  Related Stories