More

  వేట మొదలుపెట్టిన డ్రాగన్..!

  యుద్ధంలో ఆరితేరామని చెప్పుకునే అగ్రదేశాలు కూడా వ్యూహాత్మక సందిగ్ధత-state of strategic ambiguity ఆవహించినపుడు చైనా యుద్ధకళకు సంబంధించిన సైద్ధాంతిక అంశాలనే ప్రామాణికంగా భావించి అధ్యయనం చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ చెప్పి, చైనా ఎందుకు ఆఫ్ఘనిస్థాన్ పై పట్టు పెంచుకుంటుందో-పెంచుకునే అవకాశం ఉందో చూద్దాం.

  1990-91 గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం యుద్ధకళకు సంబంధించి వందలాది పుస్తకాలను ఓడలకెత్తింది. అందులో సింహభాగం చైనా యుద్ధ నిపుణుడు సున్ జూ రాసిన ‘యుద్ధకళ’ పుస్తకాలే. కువైట్ నగర స్వాధీనానికి వెళుతున్న బలగాలను ఉద్దేశించి అమెరికా యుద్ధ సిద్ధాంత కర్త, ప్రభావశీలమైన రణరంగ చతురుడిగా పేరున్న జాన్ బాయ్డ్ సుమారు 8 గంటలపాటు ఏకబిగిన ఉపన్యాసం ఇచ్చాడట. 

  అంతేకాదు, 380 పవర్ పాయింట్ స్లైడ్ల ద్వారా యుద్ధ సూక్ష్మాలను చెప్పాడట. సుమారు 35 దేశాలకు చెందిన బలగాలు, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీ పరిమాణంలో సైన్యాన్ని మోహరించి కువైట్ నగరాన్ని ఇరాక్ చెర నుంచి విముక్తి చేసింది అమెరికా.

  ఈ ఉదాహరణలో మూడు అంశాలను గమనించవచ్చు. మొదటిది: పశ్చిమాసియా మైదానంలో స్థిరయుద్ధ అనుభవం మాత్రమే ఉన్న సేనలు అంతసునాయాసంగా విజయం సాధించలేవు. రెండోది: అమెరికా తాను చెప్పుకున్నంత సైనిక పాటవం ఉన్న దేశం కాదు. మూడు: చైనా తన ప్రాచీన యుద్ధ అనుభవాలను నిరంతరం సరిదిద్దుకుంటూ, సైద్ధాంతిక స్థాయికి తెచ్చేందుకు, సాధారణీకరించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. రెండువేల ఏళ్ల యుద్ధ అనుభవాన్ని ‘యుద్ధకళ’గా నిక్షిప్తం చేశాడు సున్ జూ.

  యుద్ధం మాత్రమే ప్రాణవాయువుగా బతికిన దేశం చైనా. పశ్చిమ దేశాల సైనిక సిద్ధాంతానికీ, చైనా యుద్ధ సిద్ధాంతానికీ మౌలికమైన వ్యత్యాసం ఉంది. భారత యుద్ధనీతి ఈ రెంటికీ భిన్నం. యుద్ధం లేకపోతే చైనాలేదు. పైగా గెరిల్లా యుద్ధకళను మరింత నిశితం చేసింది కూడా చైనాయే. భారత దేశం ధర్మయుద్ధాన్ని నమ్మితే, చైనా కపట యుద్ధాన్ని నమ్ముకుంది. అనివార్యపక్షంలో మాత్రమే మనదేశం యుద్ధాన్ని ఆశ్రయించింది. యుద్ధానికీ యుద్ధానికీ మధ్య దొరికిన విరామంలో సేదతీరిన దేశం చైనా.

  ఈ కారణంగానే చైనా ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై పట్టుసాధించి ఆసియాపై పట్టు సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాకు మేం తీసుకున్న ఆధారాలు…

  1.  రెండు అతి ముఖ్యమైన పుస్తకాలు: బ్రిటీష్ జర్నలిస్ట్ Martin Jacques రాసిన  ‘‘When China Rules the World’’
  2. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే Hudson Instituteలో Center on Chinese Strategy విభాగానికి డైరెక్టర్    గా పనిచేసిన Michael Pillsbury రాసిన ‘‘The Hundred-year Marathon: China’s Secret Strategy to Replace America As the Global Superpower’’

  యుద్ధకళకు వాణిజ్యాన్నీ, దౌత్యాన్నీ జోడించి…క్రమంగా ఎలా పరివ్యాప్తి చెందుతుందో చూద్దాం. ‘‘When China Rules the World’’ మార్టిన్ జాక్స్ అంచనాలు పరిచయం చేస్తాను.

  • As Deng put it, in the time-honoured tradition of pithy and popular quotes by Chinese leaders from Confucius onwards: ‘Seek truth from the facts’; ‘Truth is to be found in practice’; and ‘Cross the river by feeling for the stones’.
  • 1976 మావో మరణం తర్వాత బాల్యారిష్టాలను ఎదుర్కొన్న చైనా 1978లో సంస్కరణలవైపు అడుగుపెట్టింది. డెంగ్ జియావో పింగ్ నేతృత్వంలో మొదలైన సంస్కరణల పర్వం తీసుకున్న నినాదాలు అత్యంత ఆసక్తికరమైనవి. చైనీయులు విశ్వసించే కన్ఫ్యూషియస్ సూత్రాలను సంస్కరణలకు అనుసంధానం చేశాడు డెంగ్. ‘వాస్తవం నుంచి సత్యం నేర్చుకో’, ‘సత్యం ఆచరణలో కనిపిస్తుందా లేదా చూడు’, నీటి అడుగున ఉన్న రాళ్ల ఆధారంగా ఒక రాయి ఆసరగా చేసుకుని మరో రాయిపై కాలుమోపి నదిని దాటు’ లాంటి నినాదాలు ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి.
  • China continues to grow stronger and ultimately emerges over the next half-century, or rather less in many respects, as the world’s leading power. There is already a widespread global expectation that this may well happen. a majority of Indians, for example, believe that China will replace the United States as the dominant power within the next twenty years
  • రాబోయే అర్ధ శతాబ్దంలో చైనా మరి శక్తివంతమవుతుంది. ప్రపంచ దిగ్గజమవుతుంది. ఇంకా తక్కువ సమయం పట్టినా ఆశ్చర్యంలో లేదు. చైనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే భావన ఆవరించి ఉంది. రాబోయే ఇరవై ఏళ్ల కాలంలో అమెరికా స్థానాన్ని చైనా భర్తీ చేస్తుందని భారతీయులు కూడా అభిప్రాయపడుతున్నారు.
  • As China begins to emerge as a global power, what forms will its growing strength take? Or, to put it another way, what will a globally hegemonic China look like? How will its power be expressed and how will it behave in such a scenario?
  • ఒక వేళ చైనా అగ్రరాజ్యంగా ఎదిగితే తనశక్తిని ఎలా ప్రదర్శిస్తుంది? ఏ ఏ రూపాలను ఆశ్రయిస్తుంది? గ్లోబల్ నియంతగా మారిన చైనా రూపు రేఖలు ఎలా ఉంటాయి? అలాంటి స్థితిలో ఎలా ప్రవర్తిస్తుంది? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తారు రచయిత.

  నిజానికి ఈ ప్రశ్నలు అత్యంత ఆసక్తికరమైనవి. అయితే వీటికి జవాబు చరిత్రలో దొరకదు. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల నేపథ్యంలో మరికొన్నేళ్లలో చైనా ప్రవర్తనను చూసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 2025 నాటికి అలాంటి సందర్భం తటస్థపడినా ఆశ్చర్యం లేదు.

  వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే Hudson Instituteలో Center on Chinese Strategy విభాగానికి డైరెక్టర్    గా పనిచేసిన Michael Pillsbury రాసిన ‘‘The Hundred-year Marathon: China’s Secret Strategy to Replace America As the Global Superpower’’ పుస్తకంలో ఏముందో చూద్దాం….

  ఈ పుస్తకంలోని విభాగాలకు పెట్టిన పేర్లే అత్యంత ఆసక్తిదాయకం. మొదటి భాగం ‘The china dream’తో మొదలై… చివరి భాగం ‘America as a warring state’ తో ముగుస్తుంది. కలతో మొదలై విచ్ఛిత్తితో అంతమవుతుంది.  నిజానికి ఈ స్థితి అమెరికాకే కాదు, చైనాకు కూడా భవిష్యత్తులో వర్తించే అవకాశం ఉంది.

  • “There cannot be two suns in the sky, nor two emperors on the earth.” అనే కన్ఫ్యూషియస్ సామెత చైనా విస్తరణ కాంక్ష వెనుక ఉన్న అసలు వ్యూహం. వినీల గగనంపై ఇద్దరు సూర్యుళ్లు ఉండనట్టే..భూగోళంపై ఇరువురు సామ్రాజ్యాధిపతులు ఉండకూడదు అంటుంది డ్రాగన్.
  • జిన్ పింగ్ 2013లో అధికారంలో చేపట్టిన అమెరికాలోని చైనా పరిశీలకులు అంచనా కోసం తంటాలు పడ్డారు. చైనా డేగలు ఆయన్ను అభిమానించారు. అరవై ఏళ్ల వయసులో, చిరునవ్వుతో కనిపించే జినిపింగ్ ను గోర్బచేవ్ లాంటి సంస్కరణ వాదిగా భావించాయి పశ్చిమ దేశాలు.పాత చైనా విధానాల స్థానంలో స్వేచ్ఛా విఫణికి మార్గం సుగమం అవుతుందని కలలుగన్నారు. కానీ, జిన్ పింగ్ తనదైన కలేదో తనకు ఉందంటూ చెప్పకనే చెప్పాడు. ప్రపంచం అధికార రంగస్థలంపై చైనా తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుందన్న సూచనలు చేసింది.
  • “Deck the tree with false blossoms” చెట్టుకు కపటపు పుష్పాలు అలంకరించు..అనేది China ancient 36 strategemsలో ఒకానొక సూత్రం. అంటే చైనా నీతిలో కనిపించిందీ-దాని వెనుక దాగుడు మూతలాడేదీ వేరు వేరు.
  • ‘‘చైనా ప్రభుత్వ పనితీరు చాలా భిన్నం. ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మక వైఖరి ఉన్న పాత్రికేయులు, విద్యావేత్తలు, పరిశోధకుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడే అనుకూల సమాచారాన్ని చాలా క్రూరమైన మార్గాల్లో జనాలకు చేరవేస్తుంది. ప్రతికూల సమాచారాన్ని నొక్కిపెట్టేస్తుంది. తియాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత చైనా అధికారిక చరిత్రను పూర్తిగా మార్చివేసింది. చరిత్ర పునర్వ్యాఖ్యానాన్ని వ్యతిరేకించినవారిని శిక్షించింది’’.
  • the operation had a $12 billion annual budget and was run by the Politburo’s Standing Committee, which met weekly in a secret room in Beijing, spending much of its time creating messages to be promoted by a propaganda system that controlled Chinese newspapers, television programs, and magazines published overseas, as well as the Chinese Internet.
  • ఏటా 12 బిలియన్ డాలర్ల బడ్జెట్ తో సీపీసీ పొలిట్ బ్యూరో ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక ఆపరేషన్ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రికలు, టీవీ ఛానళ్లు, ఇంటర్ నెట్ సహా అంతర్జాతీయ పత్రికల్లో చైనా అనుకూల సమాచారాన్ని వండివార్చడమే! ఈ ఆపరేషన్ కోసం బీజింగ్ లో ఓ రహస్య కార్యాలయం ఏర్పాటు చేసింది సీపీసీ.
  • “The guest becomes the owner” అతిథి యజమానిగా మారతాడంటుంది ప్రాచీన చైనా యుద్ధకళకు సంబంధించిన ‘’36 strategems’’ లోని వ్యూహసూత్రం. ఆఫ్ఘనిస్థాన్ కు చైనా ప్రస్తుతానికి అతిథి. యజమానిగా మారడం త్వరలో జరిగే అవకాశం లేకపోలేదు.
  • భూగోళంపై నివసిస్తున్న 7బిలియన్లకు పైగా ప్రజలు అమెరికా సినిమాలు, పాప్ గీతాలు, అమెరికా సొడా, చైన్ రెస్టారెంట్లు, అమెరికా విశ్వవిద్యాలయాలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిరంతరం ఆరాతీయడంలోనే నిమగ్నమై ఉన్నారు. అమెరికా సాంస్కృతిక, సైనిక, ఆర్థిక ప్రభావం ప్రపంచాన్ని ఊహించలేం. రోజువారీ జీవితంలో అమెరికా ప్రభావాన్ని లెక్కగట్టలేం. సరిగ్గా ఇలాగే అమెరికన్లు కూడా తమ దేశానికి అగ్రరాజ్య హోదా లేకపోతే ఏమవుతుందో అన్న బెంగ లేకుండానే బతుకుతున్నారు.
  • 2050 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలదన్నే స్థితికి చేరుతుందనేది ఒక అంచనా. మూడింతలు పెద్దదిగా ఉండే అవకాశం ఉందంటారు. నిపుణులు మూడు అంచనాలను వెలువరించారు: 1. చైనా జగజ్జేతగా అవతరించి ఏకధ్రువ ప్రపంచం ఏర్పడే అవకాశం. 2. చైనా, అమెరికా లు రెండు అగ్రరాజ్యాలుగా కొనసాగి ద్విధ్రువ ప్రపంచం ఏర్పడే ఛాన్స్, 3. చైనా, అమెరికా, భారత్ మూడు దేశాలు తమ సత్తా చాటితే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుందనే అంచనాలను Michael Pillsbury తన పుస్తకం ‘‘The Hundred-year Marathon: China’s Secret Strategy to Replace America As the Global Superpower’’లో వెల్లడించారు.

  ఇవీ…చైనా భవిష్యత్తుకు సంబంధించిన మైఖెల్ పిల్స్ బరీ, జాక్స్ మార్టిన్ లు తమ పుస్తకాల్లో వెల్లడించిన అంశాలు. ప్రస్తుత స్థితి ఆధారంగా నిపుణులు, దశాబ్దాలుగా అధ్యయనం, పరిశోధన చేసినవారు వెల్లడించే భవిష్యత్తు అంచనాలు. ఇవీ పూర్తిగా ఊహాజనితం కాదు, అట్లాగని ఖచ్చితంగా జరిగితీరతాయనీ కాదు. అంచనాలను పూర్తిగా తిరస్కరించడం కానీ, సంపూర్ణంగా ఆమోదించడం కానీ అంత శ్రేయస్కరం కాదు.

  ఆఫ్ఘనిస్థాన్-చైనా రెండు దేశాలూ గెరిల్లా యుద్ధకళలో ఆరితేరినవే! అయితే ఆఫ్ఘనిస్థాన్ తెగలు చేసే గెరిల్లా యుద్ధం సూత్రబద్ధమైంది కాదు. దాంతో పాటు అపారమైన ప్రాణనష్ఠం కూడా ఉంటుంది. చైనా యుద్ధకళ పూర్తిగా భిన్నమైంది. రెండూ పర్వత ప్రాంత దేశాలే అయినా చైనా తన యుద్ధ అనుభవాలను conceptualize చేస్తూ వచ్చింది. ఖచ్చితమైన నియమాలు, ప్రమాణాలను రూపొందించింది. ఆఫ్ఘనిస్థాన్ లోని తెగలు సంప్రదాయ యుద్ధ పద్ధతులకు ఆధునిక, అత్యాధునిక ఆయుధాలను జోడించారు. ఖైబర్, బోలాన్, హిందూకుష్ పర్వత శ్రేణులు తెగల యుద్ధకళకు అనుకూలించాయి. ఈ కారణంగానే గతంలో అనేక యుద్ధాలను సునాయాసంగా గెలిచాయి ఆఫ్ఘన్ తెగలు. అయితే చైనాతో వైరం వస్తే….అంత సులభంగా విజయం సాధిస్తాయా? 90కిలో మీటర్ల సరిహద్దును ఆసరా చేసుకుని చైనా దాడికి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు జవాబు భవిష్యత్తు మాత్రమే ఇవ్వగలదు.

  Trending Stories

  Related Stories