Right Angle

ఆఫ్ఘనిస్తాన్‎ను చైనా ఆక్రమిస్తుందా..?

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. కరడుగట్టిన ఉగ్రనేతలు అధికారపీఠాన్ని అధిరోహించారు. పంజ్ షేర్ లోయ దాదాపు తాలిబ్ ల స్వాధీనంలోకి వచ్చేసింది. ప్రపంచ శాంతి భద్రతల కోసం ఏడున్నర దశాబ్దాల క్రితం పురుడుపోసుకున్న ఐక్యరాజ్య సమితి అనుకున్నట్టుగానే మౌనం పాటించింది. భద్రతా మండలి కుక్కిన పేనులా పడి ఉంది. పంజ్ షేర్ చిట్టచివరి ఆర్తనాదంతో ఐక్యరాజ్య సమితి నిస్తేజమైంది.

బ్రిక్స్ దేశాల వర్చువల్ సదస్సులో సభ్యదేశాలన్నీ ‘ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రస్వర్గం’గా మారకూడదని ప్రవచనాలు వల్లించాయి. శాంతి ప్రవక్తల్లా వర్తించాయి రష్యా, చైనా దేశాలు. వర్చువల్ మీట్ పుణ్యాన కనీసం ఎదురెదురుగా అయినా పరస్పరం అబద్ధాలు ఆడుకోనందుకు, మోసపుచ్చుకోనందుకు సంతోషించాలి.

ఒకరికొకరు బాగా తెలుసు. ఎవరి లక్ష్యాలు ఏంటో కూడా అందరికీ తెలుసు. ప్రతి ఒకటో వాడు, రెండో వాడితో అబద్ధం చెప్పినట్టు నడిచింది బ్రిక్స్ సదస్సు. కూలిపోతున్న గోడతాలూకు ఇటుకల ధ్వని బ్రిక్స్ ఉపన్యాసాల సారాంశం. తాలిబన్ల అంశంపై బ్రిక్స్ కూటమిలో భారత్ ఒంటరిగా మారింది. అందుకే రష్యా సాయాన్ని కోరింది.  

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా 229 కోట్ల సాయాన్ని యుద్ధప్రాతిపదికన తాలిబన్లకు అందించింది. తాలిబన్ సేనలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కరోనా వ్యాక్సిన్లను ఆగమేఘాల మీద కాబూల్ కు తరలించింది.

2049నాటికి జగజ్జేత కావాలని చూస్తున్న డ్రాగన్ వ్యూహాత్మక ప్రయాణంలో ఆఫ్ఘనిస్థాన్ అత్యంత కీలకమైన మైలురాయి. 2026 నాటికి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో పూర్తి స్థాయిలో పాగా వేస్తే 2030 నాటికి మొదటి ముందడుగు, 2040 నాటికి రెండో అడుగూ వేసి 2049 నాటికి పెద్ద గెంతు వేయాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. హిందూ కుష్ పర్వతాల్లో పంజ్ షేర్ ఆర్తనాదాలు చేసినట్టే..తాలిబన్లు కూడా చైనా చక్రబంధంలో ఇర్కుక్కుని రాబోయే రోజుల్లో చరిత్రలోకి చేరిపోవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.

 చైనా-2049 లక్ష్యం సాధ్యమేనా? సాధ్యమే అయితే ఎలా? ఏ మార్గాలను అనుసరిస్తుంది? ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న క్రమంలో మాకు తారసపడిన పత్రికలు, పుస్తకాల వివరాలు చెపుతాను.

 1. FINANCIAL TIMES పత్రిక ఆగస్ట్ 18న ప్రచురించిన ‘‘China and Russia poised to step into the Afghanistan gap’’ కథనం…
 2. FORBES పత్రికలో 2019, నవంబర్ 12న John Mauldin రాసిన ‘‘China’s Grand Plan To Take Over The World’’ ప్రత్యేక వ్యాసంతో పాటు…
 3. రెండు అతి ముఖ్యమైన పుస్తకాలు: బ్రిటీష్ జర్నలిస్ట్ Martin Jacques రాసిన  ‘‘When China Rules the World’’
 4. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే Hudson Instituteలో Center on Chinese Strategy విభాగానికి డైరెక్టర్    గా పనిచేసిన Michael Pillsbury రాసిన ‘‘The Hundred-year Marathon: China’s Secret Strategy to Replace America As the Global Superpower’’

వీటి అధ్యయనం వల్ల మాకు కలిగిన అవగాహనను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే వీటి నిడివి కారణంగా వీడియోను రెండు ఎపిసోడ్ లుగా విభజించాను. రెండు భాగాలను పూర్తిగా చూస్తే చైనా ఎదుగుదలను, సైనిక వ్యూహాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ముందుగా Financial times ‘‘China and Russia poised to step into the Afghanistan gap’’ కథనంలో ఏముందో ప్రధాన అంశాలను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడం అమెరికా ఆగర్భ శతృదేశాలైన చైనా, రష్యాలకు మరొక అవకాశాన్ని కల్పించింది. ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ఆ రెండు దేశాల పాత్ర పెరిగింది.

‘అమెరికా బాధ్యతా రాహిత్య ప్రవర్తన వల్ల చైనాకు ప్రయోజనం కలిగింది. తన ప్రతిష్ఠను మరిచిపోయి అమెరికా విదేశాంగ విధానాన్ని అభాసుపాలు చేసిందంటూ’ చైనా ప్రభుత్వ సలహాదారు జూ యాంగ్ బయో చేసిన వ్యాఖ్యలను ఈ కథనం పేర్కొంది.

‘ఉమ్మడి ప్రయోజనాల కోసం అమెరికాను వ్యతిరేకించాం. అమెరికాకు మంచి మాకు చెడు. మాకు మేలు చేసేది అమెరికాకు కీడు’ అంటూ మాస్కోలోని మధ్య ఆసియా నిపుణుడు ఆర్కాడీ దుబ్నోవ్ వ్యాఖ్యలను కూడా జతచేసింది.

మరో ఆసక్తికరమైన అంశాన్ని ఈ కథనం పేర్కొంది. ఐక్యరాజ్య సమితిలో తాలిబన్ కు ఉన్న ఉగ్రవాద ముద్రను తొలగించేందుకు కృషి చేస్తామని చైనా ప్రతినిధులు పేర్కొనడాన్ని ఉటంకించింది. యూ.ఎన్ లో తాలిబన్ పై ఉగ్రవాద ముద్ర తొలగాలంటే అమెరికా సహకారం అత్యవసరం కాబట్టి అందుకోసం దీర్ఘకాలిక దౌత్య ప్రయత్నాలు చేస్తామని కూడా చైనా వర్గాలు పేర్కొన్నాయట.

ఈస్ట్ తుర్క్ మెనిస్థాన్ ఇస్లామిక్ మువ్ మెంట్, వీగర్ ముస్లీం ఫైటర్లను అదుపు చేయడానికి కూడా తాలిబన్ బంధం ఉపయోగపడుతుంది. ఈ రెండు ఉగ్రసంస్థలు ఉమ్మడి చైనా వ్యతిరేక పోరాటం చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ETIM ఫైటర్ల సంఖ్య సుమారు 3వేల 5వందలు.

ఇటీవలే చైనాలోపర్యటించిన తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో జరిగిన సమావేశంలో చైనా ప్రతిపాదనలకు తల ఊపినట్టు ఫినాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం పేర్కొంది. లోపాయికారి ఒప్పందం తర్వాతే చైనా ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చినట్టూ అంచనా. ఇదీ ముక్తసరి సారాంశం.

ఇక ఫోర్బ్స్ పత్రిలో వచ్చిన జాన్ మాల్డిన్ రాసిన ‘‘China’s Grand Plan To Take Over The World’’ వ్యాసంలో ఏముందో చూద్దాం….

 • ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటికి  చైనా పతనావస్థలో ఉంది. క్రమంగా పుంజుకుని 70వ దశకం నాటికి క్రమంగా పాశ్చాత్య ప్రపంచంవైపు చూడనారంభించింది. 1980 నాటికి చైనా జాతీయ స్థూల ఉత్పత్తి కేవలం ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం 90 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం చైనా జీడీపీ 12 ట్రిలియన్ డాలర్లు. అతి తక్కువ సమయంలో ఆ స్థాయి ఆర్థిక వృద్ధి సాధించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
 • సోవియట్ కుప్పకూలింది. ఇంటర్ నెట్ ఆవిష్కరణ జరిగింది. అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికా మార్కెట్ మొత్తాన్ని ఆక్రమించింది. తక్కువ ఉత్పత్తి ఖర్చుగల దేశాలకు విస్తరించింది. ఈ పరిణామమే అనివార్యంగా గ్లోబలైజేషన్ కు దారితీసింది. ప్రపంచమంతా తమ వెంటే పరుగులు తీస్తోందని పాశ్చాత్య ప్రపంచం భావించింది. కానీ, చైనా అందుకు భిన్నంగా ఆలోచిస్తూ వచ్చింది. కమ్యూనిజాన్ని రీబ్రాండ్ చేసింది.  

బ్రిటీష్ జర్నలిస్ట్ Martin Jacques రాసిన  ‘‘When China Rules the World’’ పుస్తకంలో పేర్కొన్న కీలక అంశాలను…నిడివి దృష్టిలో ఉంచుకుని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకాన్ని రచయిత రెండు భాగాలుగా విభజించాడు.

మొదటి భాగం: The end of the western world

రెండో భాగం: The age of china

 • Following the Second World War,the US was the prime mover in the creation of a range of multinational and global institutions, such as the United Nations, the International Monetary Fund and NATO, which were testament to its new-found global power and authority ….మార్టిన్ జాక్స్ ప్రాథమికమైన, కీలకమైన నిర్ధారణ తో తన పుస్తకంలోని తొలి భగాన్ని మొదలుపెట్టారు. రెండో ప్రపంచ సంగ్రామం అమెరికాకు ఎలా మేలు చేసిందో, ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ద్రవ్యసంస్థ, నాటో లాంటి ప్రామాణిక సంస్థలను స్థాపించి తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకున్న తీరును వివరిస్తారు.
 • From the beginning of Britain’s Industrial Revolution in the late eighteenth century until the mid twentieth century, Europe was to shape global history in a most profound manner. The engine of Europe’s dynamism was industrialization and its mode of expansion colonial conquest.
 • 18వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి ఇరవయ్యో శతాబ్ది మధ్య వరకు ప్రపంచ చరిత్రను యూరప్ దేశాలు ఎలా శాసించాయో, వాటి ప్రాథమిక లక్ష్యాలైన పారిశ్రామీకీకరణ, వలసరాజ్యాల ఏర్పాటు ఎలాంటి పాత్ర పోషించిందో చెపుతారు.
 • In 1950 the US GDP was almost three times that of East Asia and almost twice that of Asia. By 2001 US GDP was only two-thirds that of Asia, and rather less than that of East Asia.
 • 1950 నాటికి అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి తూర్పు ఆసియాతో పోలిస్తే 3 రెట్లు, ఆసియా కన్నా రెండింతలు ఎక్కువనీ, అయితే 2001 వచ్చేసరికి ఆసియా జీడీపీతో పోలిస్తే మూడింట రెండొంతులకు, తూర్పు ఆసియాకన్నా తగ్గిపోయిందనే…అమెరికా పతన క్రమాన్ని వివరిస్తారు.
 • The mainstream Western attitude has held that, in its fundamentals, the world will be relatively little changed by China’s rise. This is based on three key assumptions: that China’s challenge will be primarily economic in nature; that China will in due course become a typical Western nation; and that the international system will remain broadly as it now is, Each of these assumptions is misconceived. The rise of China will change the world in the most profound ways.
 • ప్రధాన స్రవంతి పాశ్చాత్య భావన ప్రాథమిక అంశాల వద్ద మిగిలిపోతే, చైనా ఎదుగుదలతో ప్రపంచం సాపేక్షికంగా మారిపోయింది. మూడు భావనల పునాదుల వల్ల ఇలా జరిగింది. చైనా కేవలం ఆర్థిక రంగంలో మాత్రమే సవాలు విసురుతుందనీ, కాలక్రమేణా చైనా కూడా పాశ్చాత్య నమూనాలోకి రూపాంతరం చెందుతుందనీ, అంతర్జాతీయ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుందని భావించడం వల్ల మాత్రమే పశ్చిమ దేశాల అంచనా తప్పిందంటారు. చైనా తనదైన శైలిలో ప్రపంచ గతిని మార్చేస్తుందంటారు.
 • THE NATURE OF CHINESE POLITICS భాగంలో పాశ్చాత్య ప్రపంచం యూరోపియన్ కమ్యూనిజం పతనం ఆధారంగా చైనా భవిష్యత్తును అంచనావేయడంతో మరో పొరపాటు జరిగిందనీ, వాస్తవ రూపంలో యూరోపియన్ కమ్యూనిజానికీ, చైనా కమ్యూనిజానికి స్వాభావిక భేదముందంటారు జాక్స్.
 • days of the dollar as the dominant global currency are now numbered. At the same time, the Chinese government is actively seeking ways to progressively internationalize the role of the renminbi. It recently concluded a number of currency swaps with major trading partners including South Korea, Argentina and Indonesia, thereby widening the use of the renminbi outside its own borders.
 • డాలర్ ప్రాబల్యం తగ్గే అవకాశాలను అంచనా వేసిన చైనా తన సొంత కరెన్సీ renminbi ని క్రమంగా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు విస్తరించిన వైనాన్ని చెప్పారు. కరెన్సీ అంతర్జాతీయకరణ అన్నది చైనా ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా చెపుతారు. వాణిజ్య భాగస్వామ్యం ఉన్న దేశాలైన దక్షిణ కొరియా, అర్జెంటినా, ఇండోనేసియాలకు విస్తరించిన చైనా కరెన్సీ క్రమంగా విస్తరిస్తున్న పరిణామాన్ని చెపుతారు.

మరో కథనంలో ఈ పుస్తకం సహా Michael Pillsbury రాసిన ‘‘The Hundred-year Marathon: China’s Secret Strategy to Replace America As the Global Superpower’’ వివరాలను మరింత క్షుణ్నంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

2 × five =

Back to top button