డ్రాగన్ వీడియో ‘గేమ్’..!

0
868

చైనాను గుడ్డిగా నమ్మరాదన్న నిజం మరోసారి రుజువైంది. ఎన్నడూ లేనట్టు.. ఎలాంటి పేచీ పెట్టకుండా.. సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నప్పుడే అనుమానించాల్సింది. తొమ్మిది నెలల తర్వాత గల్వాన్ మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన చేయడంతోనే కీడును శంకించాల్సింది. ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తుందని.. కొత్త పన్నాగానికి స్కెచ్ వేస్తుందని. అనుకున్నట్టే జరిగింది. అనుమానాలే నిజమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కుయుక్తులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం.. దౌత్య పరంగా ఆ దేశానికి చుక్కలు చూపించడంతో.. ఇక జిత్తుమారి కొత్త రూట్ ఎంచుకుంది. వెనక్కి తగ్గుతున్నట్టు తగ్గి.. కొత్త ప్లాన్ కు స్కెచ్ వేసింది. ఓ అతుకులబొంత వీడియోను రిలీజ్ చేసి.. భారత్ ను బద్నాం చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.

గల్వాన్ హింసాత్మక ఘటనకు సంబంధించి.. చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ తాజాగా ఓ విడుదల చేసింది. ఇందులో తాము సుద్దపూసలమంటూ.. భారత సైన్యమే తమపై దాడి చేసిందంటూ చెప్పే ప్రయత్నం చేసింది. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చినట్లు అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. రెండు దేశాలు కూడా ఇటీవలే సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. గల్వాన్ లో చనిపోయిన.. తమ సైనికుల సంఖ్యపై తొలిసారిగి స్పందించిన మరుసటిరోజే.. ఈ వీడియో విడుదల కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. భారత్ పేరును ప్రస్తావించకుండా.. ప్రత్యర్థి అంటూ సంబోధిస్తూ విడుదల చేసిన ఈ వీడియో.. చైనా స్కెచ్ లో భాగమని స్పష్టంగా తెలుస్తోంది. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మసిపూసి మాయజేసేలా.. 3 నిమిషాల 20 సెకండ్ల కూడిన బ్రహ్మాండమైన వీడియో కథను అల్లింది.

ఈ వీడియో ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను దోషిగా చూపి… ప్రపంచ దేశాల సానుభూతిని కొట్టేసేందుకు డ్రాగన్ ఈ పన్నాగం పన్నిందా..? తొమ్మిదిసార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిపినా.. వెనక్కి తగ్గేందుకు మొండికేసిన డ్రాగన్.., హఠాత్తుగా వెనక్కి మళ్లడంపై కూడా ఏదో కొత్త ఎత్తుడగానే వేసిందా..? ఆలోచించాల్సిన అంశమే. అయితే డ్రాగన్ కంట్రీ పెంపుడు పత్రిక విడుదల చేసిన ఆ వీడియోలో వాస్తవం అస్సలు లేదు అనేది వీడియో చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ స్కిల్స్ చూస్తే అంతకుముందు ఒక హాలీవుడ్ క్లిప్ ను కాపీ చేసి తమ దేశపు వాయుసేన సామర్ధ్యంగా చూపెట్టుకున్న మాదిరిగానే మరోసారి తన గాలి తనే తీసుకుంది. ఆ వీడియోను ఈ వీడియో ఎండ్ లో ప్లే చేస్తాను తప్పకుండా చూండండి..

ఇదిలావుంటే, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పర్వతప్రాంత యుద్ధాల్లో రాటుదేలిన భారత సైన్యంతో పోరాడటం కష్టమేనని మొత్తానికి ఓ కార్లిటీకి వచ్చిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వివాదాస్పద ప్రాంతాల నుంచి తన బలగాలను క్రమంగా ఉపసంహరిచుకున్నాయి. ఇప్పటికే పాంగాంగ్ సరిహద్దుల్లోని తన బలగాలను చైనా వెనక్కి రప్పించింది. అక్కడ ఏర్పాటు చేసిన బంకర్లు, గూఢారాలను సైతం తొలగించింది. ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి తగ్గాయి.

తాజాగా శనివారం… రెండు దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశం అయ్యారు. చైనాలోని వైపులోని మోల్దోలో సీనియార్ కమాండర్ స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. భారత తరపున లేహ్ లోని 14వ కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌, చైనా తరఫున దక్షిణ షింగ్‌యాంగ్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లియు లిన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇలా రెండు దేశాల సైనికాధికారుల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం కోసం చర్చలు జరగడం ఇది పదోసారి. ఇప్పటికే పాంగాంగ్ లేక్ వద్ద నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో… హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, దేప్సాంగ్‌ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడంపై ప్రస్తుతం చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక, చైనా అభూతకల్పనలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు చూద్దాం..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 1 =