దురాశ, దుర్మార్గం, కక్కుర్తి,.. నీచత్వం, రాక్షసత్వం, అవకాశవాదం, విస్తరణవాదం.. ఇలా, ప్రపంచంలోని అవలక్షణాలన్నిటికీ ఒకే పేరు పెడితే.. దానికి ‘చైనా’ అనే పదకం కచ్చితంగా సరిపోతుంది. చావులోనూ అవకాశవాదం ప్రదర్శించే చవకబారు దేశం అది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఇప్పుడు చెప్పబోయేది వింటే.. చైనాను మీరు ఇంతకంటే ఘోరంగా నిందిస్తారు. అది నా గ్యారంటీ..! విస్తరణవాదం, ప్రపంచ పెత్తనం, ఆర్థిక శక్తిగా ఎదగడం కోసం.. అడ్డదారులు తొక్కిన డ్రాగన్.. ఈ భూమ్మీద కరోనా అనే ఓ విషబీజాన్ని నాటి.. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసింది.
అదీ చాలక.. గాయం చేసి మందు రాసినట్టు.. హడావుడిగా ఓ వ్యాక్సిన్ తయారు చేసి జనం మీదికి వదిలింది. చవకగా ఇచ్చేస్తామంటూ ప్రపంచ దేశాలను ఊదరగొట్టింది. ఇక, చైనా తయారీ గురించి కొత్తగా చెప్పేదేముంది.. బుర్రలో గుజ్జు తక్కువగా వున్న పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలు తప్ప.. చైనా వ్యాక్సిన్లను ఎవడూ నమ్మలేదు. చైనా వస్తువులకు గ్యారెంటీ లేనట్టే.. ఆ దేశం వ్యాక్సిన్లు వేసుకుంటే తమ ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదేమోనని.. ప్రపంచ దేశాలు బలంగా నమ్మాయి. దీంతో టీకాలమ్మీ స్టార్ కావాలన్న చైనా దురాశ.. ఆదిలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదే సమయంలో భారత్ ప్రపంచ దేశాలకు సంజీవనిగా మారింది. అగ్రదేశాలు, అణగారిన దేశాలు అనే తేడాలేకుండా ఉదారంగా వ్యాక్సిన్లు సరఫరా చేసి.. ప్రాణాలు నిలబెట్టింది. ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదంతా చూసి చైనాకు కడుపు రగిలిపోయినట్టుంది. ఎలాగైనా వ్యాక్సిన్ల బిజినెస్ పెంచుకోవాలని చావు తెలివితేటలు ప్రదర్శించింది. మా టీకా వేసుకుంటేనే వీసా ఇస్తామంటూ.. మడతపేచీ పెట్టింది. కనీసం తమ దేశంలోకి వచ్చే విదేశీయులకైనా వ్యాక్సిన్ అమ్మి.. బిజినెస్ పెంచుకోవాలన్న కక్కుర్తి బుద్ధిని ప్రదర్శించింది.
కరోనా వ్యాప్తి చేయడమే కాకుండా.. అది మహమ్మారిలా మారిన తర్వాత.. తమ దేశంలోకి అన్ని దారులనూ మూసేసింది చైనా. కానీ, డ్రాగన్ ఊహించినదానికి అంతా రివర్స్ అయ్యింది. చైనాకు ప్రపంచ దేశాలన్నీ తమ ఉగ్రరూపం చూపించాయి. చైనా వస్తువులను బ్యాన్ చేశాయి. విస్తరణకాంక్షతో సరిహద్దుల్లో ఎగరిపడుతున్న లిల్లీపుట్ ఆర్మీకి భారత్ చుక్కలు చూపించింది. అడ్డదారుల్లో అందలమెక్కబోయి ప్రపంచంలో చాలా దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంది. అయినా తన కక్కుర్తి బుద్ధిని మాత్రం వదల్లేదు. వ్యాక్సిన్ సరఫరాలో భారత్ ను దాటేయాలని ఉవ్విళ్లూరుతున్న చైనా.. వాక్సిన్ ఫర్ వీసా పేరుతో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, భారత్, పాకిస్తాన్ సహా కొన్ని దేశాల వారిని అనుమతించేందుకు సరిహద్దు ఆంక్షలను కాస్త సడలిస్తామని.. యూఎస్ఏలోని చైనా దౌత్యకార్యాలయం ప్రకటించింది. చైనాలో తయారైన వ్యాక్సిన్లను తీసుకున్న విదేశియులను ఎంపిక చేసుకునేందుకు.. వీసా దరఖాస్తులను ఇచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతోంది. దీనిపై ఇప్పటికే పలు చైనా ఎంబసీలు నోటీసులు కూడా ఇఛ్చాయి.
తమ దేశంలో మళ్ళీ తమ పనులు చేపట్టేవారికి, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేవారికి, లేదా తమ దేశంలో ఉన్న మీ కుటుంబాలను కలుసుకోవాలనుకునేవారికి.. ఈ వారం నుంచి వ్యాక్సిన్ ఫర్ వీసా సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. చైనాలో ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి 14 రోజులముందు వీరు కనీసం ఒక డోసు లేదా రెండు డోసులు తీసుకుని ఉండాలని చైనా అధికారులు స్పష్టం చేశారు. భారత్ వ్యాక్సిన్లు ఇప్పటికే ప్రపంచం నలుమూలలకూ చేరిపోయాయి. దీంతో మన దేశానికి పోటీ ఇవ్వాలని.. ఇలా కక్కుర్తి ఆఫర్ తో ముందుకొచ్చింది జిత్తులమారి చైనా. ఫిలిప్పీన్స్ వంటి కొన్ని దేశాలు చైనా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకున్నా.. భారత్ తో సహా కొన్ని దేశాల్లో ఆ వ్యాక్సిన్ ఎంట్రీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో తమ టీకామందులను విస్తృతం చేసేందుకు చైనా ఇలా వీసాలకు, వ్యాక్సిన్లకు ముడిపెట్టింది. కానీ, చైనా వ్యాక్సిన్లపై అనేక దేశాలు ఇప్పటికీ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ల ఎగుమతిలో భారత్ దూసుకుపోతోంది.
ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశంలో కూడా వ్యాక్సిన్ల పంపిణీపై పకడ్బందీ ప్రణాళికను రూపొందించాయి. ఆర్థిక వనరులు, తయారీ రంగంలో సామర్థ్యాలు, లాజిస్టికల్ బలాలను కూడగట్టుకుని కోవిడ్ వ్యాక్సిన్లను తయారీ చేసి, పంపిణీ చేయాలని నిర్ణయించాయి. క్వాడ్ సభ్యదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు.. ఈ గురుతర బాధ్యతను భారత్ కే అప్పంగించాయి. ఈ నేపథ్యంలో 2022 జూన్ నాటికి ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తయారు చేయయాలని సూచించాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని బయలాజికల్ ఈ లిమిటెడ్‌కు ఆర్థిక సహకారం అందించాలని.. అమెరికా అభివృద్ధి బ్యాంకు నిర్ణయించింది. ఈ పరిణామాలన్నీ చైనా కడుపుమంటకు మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో ప్రపంచ దేశాల్లో తమ వ్యాక్సిన్ల పట్ల నమ్మకం పెంచేందుకు డ్రాగన్ కంట్రీ మల్లగుల్లాలు పడుతోంది. కానీ, ఎన్ని తిక్క వేషాలు వేస్తే మాత్రం ఏం లాభం.. నిజం నిజం కాకుండా పోతుందా..? నాసిరకం చైనా వ్యాక్సిన్లపై ఒక్కసారిగా నమ్మకం పుట్టుకొస్తుందా..?