National

బార్డర్‎లో దూసుకొచ్చిన చైనా రాకెట్..! భారత ఆర్మీ శిబిరాలే టార్గెట్..!!

చైనా మారదు. తన తీరు మార్చుకోదు. డ్రాగన్ ఎలాగైతే పరాన్న జీవో.. చైనా కూడా పరాన్న దేశమే. టిబెట్, శ్రీలంక, పాకిస్తాన్.. ఇలా చైనా బారిన పడిన ప్రతీ దేశం కూడా కకావికలమైంది. పేరుకే కమ్యూనిస్టు దేశం కానీ.. పాలనలో ప్రతి పోకడ నియంతృతంగానే కనిపిస్తుంది.

ప్రజాస్వామ్య హక్కులను కాల రాయటం, ప్రజలను ఇబ్బంది పెట్టడంలో చైనాకు ఏ దేశము సరిరాదు. అలాగే నిత్యం సరిహద్దుల్లో భారత్ ను కవ్వింలకు పాల్పడుతున్న చైనా.. మరో దుశ్చర్యానికి పాల్పడింది. సరిహద్దుల్లో డ్రాగన్ దేశం రహస్య గ్రామం నిర్మించిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం మరువకముందే మరోసారి ఆ దేశం తన కండకావరాన్ని బయటపెట్టింది. భారత బలగాలను రెచ్చగొట్టే విధంగా రాకెట్ లాంఛర్‎ను ప్రయోగించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భారత సరిహద్దు వద్ద రాకెట్​ పరీక్ష నిర్వహించింది. అడ్వాన్స్​డ్​ మల్టిపుల్​ లాంచ్​ రాకెట్​ సిస్టమ్‎ను పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీగా పేరొందిన చైనా సైన్యం.. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రయోగించింది. ఈ రాకెట్​.. భారత సైన్యం ఉన్న శిబిరాలని ఢీకొట్టేంత చేరువగా వచ్చినట్టు సమాచారం. చైనాలోని జిన్​జియాంగ్​ ప్రాంతంలో రాకెట్​ వ్యవస్థను చైనా ప్రయోగించి. ఆ రాకెట్​.. 5,300మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. కాగా.. పీహెచ్​ఎల్​-16 ఎంఎల్​ఆర్​ఎస్​ వంటి అత్యాధునిక రాకెట్​ వ్యవస్థను భారత్​- చైనా సరిహద్దు వెంబడి మోహరించేందుకు డ్రాగన్​ ప్రణాళికలు రచిస్తోంది. తాజా పరిణామాలతో ఇప్పటికే దారుణంగా ఉన్న భారత్​-చైనా సంబంధం మరింత బలహీన పడే అవకాశం లేకపోలేదు. రెండున్నరేళ్ల క్రితం.. వాస్తవాధీన రేఖ వెంబడి అలజడులు సృష్టించింది చైనా. ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్ని చర్చలు, ఎన్ని భేటీలు జరుపుతున్నా.. సమస్యలకు పరిష్కారాలు దొరకడంలేదు. కాగా.. ఆదివారమే భారత్​-చైనా ఉన్నతాధికారుల మధ్య 16వ రౌండ్​ భేటీ జరిగింది. ఆ తర్వాత.. కొద్ది రోజులకే చైనా తన రాకెట్​ను ఎల్​ఏసీ వెంబడి ప్రయోగించడం గమనార్హం.

అంతకుముందు ఇరు దేశాల సరిహద్దుల్లో డ్రాగన్ రహస్య గ్రామం నిర్మించిన విషయం బయటపడింది. ఆక్రమించడంలో ఆరి తేరిన చైనా.. సరిహద్దులోని గ్రామాలను తన భూభాగంలో ఉన్నట్టుగా చూపించుకుంటున్నది. సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకువచ్చి భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను పంగ్డా అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో ఈ దురాక్రమణ విషయం బట్టబయలైంది. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ కంపెనీ మక్సార్ ఈ శాటిలైట్ ఇమేజెస్ ను విడుదల చేసింది. భూటాన్ సరిహద్దుల్లోని భూమిని ఆక్రమించి చైనా నిర్మించిన గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట కార్లు పార్క్ చేసి ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది.

భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా అక్రమంగా గ్రామాన్ని నిర్మించడం ఇది రెండోసారి. ఐదేళ్ల క్రితమే 2017లో అక్కడ ఓ గ్రామాన్ని చైనా నిర్మించింది. అయితే అప్పట్లో భూటాన్ లోని డోక్లామ్ ఏరియాలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణానికి తెగబడటంపై భారత్ స్పందించింది. భూటాన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. దీంతో ఆ ఏడాది దాదాపు 73 రోజుల పాటు భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. దురాక్రమణవాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా..భూటాన్ లోని డోక్లామ్ పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో మూడో గ్రామాన్ని నిర్మించేందుకూ డ్రాగన్ కసరత్తు చేస్తోందని అప్పుడు మీడియా కథనాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. చైనా తన సలామీ స్లైసింగ్‌ విధానాన్ని భూటాన్‌పై ప్రయోగిస్తోందనేది నిపుణులు అంచనా వేశారు. అయితే చైనా మాటలు, చేష్టలు వేరువేరుగా ఉంటున్నాయి. చర్చల్లో శాంతి జపం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో మాత్రం డ్రాగన్ ఉద్రిక్తతలు పెంచుతోంది. అత్యంత వివాదాస్పద పాంగ్యాంగ్​ సరస్సుకు సమీపంలో బుధవారమే చైనా సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు వార్తలొచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

ten + 19 =

Back to top button