More

    చైనా ముట్టడిలో తైవాన్..!

    దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్‌గగనతలంలోకి చైనా విమానాలను పంపించి కవ్వించింది. ఇటీవల కాలంలో ఒక దేశ గగనతలంలోకి మరో దేశం విమానాలు ఈ స్థాయిలో వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి పెరిగింది. తైవాన్‌ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2025లోపు చైనా తమ దేశంపై దండయాత్ర చేయడం ఖాయమని రక్షణ మంత్రి ఛై-కూఛెంగ్‌ఏకంగా పార్లమెంట్‌లోనే పేర్కొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

    నీలి సముద్ర తీరాల మీదుగా చైనా 1683లో తైవాన్ పై దాడికి పాల్పడింది. ఆధునిక రణరంగ చరిత్రలో సంక్లిష్టమైన సముద్ర యుద్ధం ఇదే అంటారు యుద్ధ నిపుణులు. పశ్చిమ పెస్కడోర్ తీరంలో జరిగిన భయానక యుద్ధం తర్వాత తైవాన్ చైనా వశమైంది. మింగ్ రాజవంశానికి జీహుజూర్ అనాల్సిన అగత్యం ఏర్పడింది. ఆధునిక చైనా అప్రతిహత విజయాల వెనుక ఉన్న కిరాతక యుద్ధ విజయమే జనచైనాగా మారేందుకు దారితీయడానికి కారణం. బ్రిటీష్ వలస రాజ్యంగ ఉన్న కాలంలో తైవాన్ స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించింది. గత జూన్ నుంచీ చైనా-తైవాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

    రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలను విరమించుకోవాలని అమెరికా చైనాను కోరగా.. తైవాన్ కు ఆయుధాలను విక్రయించడం ద్వారా అమెరికా ఈ ప్రాంతంలో అస్థితరకు కారణమైందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ పరిణామాలన్నీ తైవాన్ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా-తైవాన్-అమెరికా మధ్య గతంలో ఏం జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోందనే వివరాలు తెలుసుకుందాం.

    ఈ ఏడాది జూన్ 9న 19 యుద్ధ విమానాల దండు తైవాన్‌ఎయిర్‌డిఫెన్స్‌ఐడెంటిఫికేషన్‌జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ ఏడాదిలో పలు మార్లు చైనా విమానాలు తైవాన్‌గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి చొరబడ్డాయి. తైవాన్‌ఈ అంశంపై పలు మార్లు ఫిర్యాదులు కూడా చేసింది. చైనా యుద్ధవిమానాల్లో వాయుసేనకు చెందిన హెచ్‌న్యూక్లియర్‌బాంబర్లు కూడా ఉన్నాయి. ఈ విమానాలు యాంటీ సబ్‌మెరైన్‌ఆపరేషన్లు కూడా నిర్వహిస్తాయి.

    చైనా ఈ ఏడాది తైవాన్‌గగనతల రక్షణ వ్యవస్థలోకి చొరబడింది. ఆగస్టు చివరి వారం వరకు 393 చైనా పీపుల్స్‌లిబరేషన్‌ఆర్మీకి చెందిన వాయుసేన, నౌకాదళ యుద్ధ విమానాలు వెళ్లాయి. 1990ల్లో తైవాన్‌క్షిపణి సంక్షోభం తర్వాత పరిస్థితి ఎప్పుడూ ఇంత తీవ్రంగా లేదు.

    ఇటీవల తరచూ పదుల సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు తైవాన్‌ఎయిర్‌డిఫెన్స్‌ఐడెంటిఫికేషన్‌జోన్‌లోకి ప్రవేశించి కవ్విస్తున్నాయి. తైవాన్‌పై గ్రేజోన్‌వార్‌ ఫేర్ వ్యూహాన్ని అనుసరించాలని చైనా కొన్నేళ్ల క్రితమే నిర్ణయించింది. ఇటీవల కాలంలో దీన్ని మరింత తీవ్రం చేసింది.

    చైనా గ్రేజోన్‌వార్‌ ఫేర్ కోసం కీలకమైన యాంటీ సబ్‌మెరైన్‌వార్ఫేర్‌కు వినియోగించే షాంక్సీ వై-8 వేరియంట్‌ను వినియోగిస్తోంది. ఇది చాలా నిదానంగా ప్రయాణిస్తుంది. వీటిని యాంటీ సబ్‌మెరైన్‌వార్‌ ఫేర్, ఎలక్ట్రానిక్‌వార్‌ఫేర్ కోసం వినియోగిస్తారు.

    అందుకే తైవాన్‌నేరుగా యుద్ధవిమానాలను వీటి వద్దకు పంపకుండా.. ఉపరితలం మీద నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలతో ట్రాక్‌చేస్తోంది. దీంతోపాటు రేడియో సిగ్నల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తోంది. చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్‌నైరుతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని చొరబాట్లకు పాల్పడుతున్నాయి. దీనికి చైనా లక్ష్యాలు వేరే ఉన్నాయి. అమెరికాతో సంబంధాలను పునఃసమీక్షించుకుంటుందని డ్రాగన్‌భావిస్తోంది. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలోని బాషి ఛానల్‌లో తన ఏ2/ఏడీ -ఏరియా యాక్సెస్‌అండ్‌ఏరియా డినైల్‌సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది.

    గత కొన్నేళ్లుగా తైవాన్‌ను వేధించడమే లక్ష్యంగా చైనా యుద్ధవిమానాలను పంపిస్తోంది. ‘తొలిసారి ఢీ కొనడమే తుది పోరును తలపించాలి’ అనే పీఎల్‌ఏ  లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని పీఎల్‌ఏ డైలీ తొలిసారి బాహ్యప్రపంచానికి వెల్లడించింది. ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా వదిలేస్తే అంతర్జాతీయ సమాజం జోక్యం పెరిగిపోతుందని చైనా అంచనా వేసింది. అదే సమయంలో చైనాలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు కూడా రావచ్చు. అందుకే వీలైనంత త్వరగా గ్రేజోన్‌వ్యూహాలను అమల్లోకి తెచ్చింది.

    ఒక వేళ యుద్ధం అంటూ వస్తే తైవాన్‌జలసంధి చాలా కీలకం అవుతుంది. అందుకే ఈ ప్రదేశంపై తిరుగులేని పట్టు సాధించేందుకు గ్రేజోన్‌వార్‌ ఫేర్ చైనాకు ఉపయోగపడుతోంది. తైవాన్‌నిఘా వ్యవస్థలు పెద్దగా సచేతనంగా లేని బ్లైండ్‌స్పాట్లను గుర్తించేందుకు దీనిని వాడతారు. ఇలాంటి బ్లైండ్‌స్పాట్లను ఉపయోగించి యుద్ధ సమయంలో తైవాన్‌వేగంగా స్పందించే లోపే దాడులు చేయవచ్చు. లేదా తైవాన్‌సైనిక రవాణా, నిర్వహణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి వాడుకోవచ్చు.

    గత నాలుగు రోజుల్లో దాదాపు చైనాకు చెందిన 150 యుద్ధ విమానాలను తమ వైమానిక రక్షణ జోన్లోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్.. చైనా నియంత్రణలోకి తైవాన్ వస్తే ఎదురయ్యే విపత్కర పరిణామాల గురించి హెచ్చరించారు.

    చైనాతో తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. 1683లో క్వింగ్ రాజవంశం తైవాన్ ను నియంత్రణలోకి తీసుకుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాలలో తైవాన్ పేరు మొదటి చైనా-జపాన్ యుద్ధం 1894-95 తర్వాత బయటకు వచ్చింది. ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్.. తైవాన్ ను ఆక్రమించుకుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై-షెక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్ను తిరిగి ఇచ్చారు.

    1949లో చియాంగ్ కై షేక్ తో పాటు అతని పార్టీ, కుమింటాంగ్ చైనాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చియాంగ్ కై షేక్ మావో సేటుంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. తర్వాత చియాంగ్ వర్గం  తైవాన్ కు పారిపోయింది.  తైవాన్ పై పరిపాలనా నియంత్రణను కొనసాగించింది చియాంగ్ వర్గం. మావో తైవాన్ పై దాడి చేయాలని నిర్ణయించిన తరుణంలో.. 1950లో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో మావో ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టులకు సహాయం చేయడంపై దృష్టిపెట్టారు.

    ఫలితంగా అప్పట్లో తైవాన్ పై దాడిని విరమించుకున్నారు. ఈ క్రమంలో తైవాన్ భద్రత, స్వతంత్య్రానికి అమెరికా హామీ ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, ఆ తరువాత కూడా తూర్పు ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా పావులు కదిపింది. ఈ క్రమంలో తైవాన్ కు మిత్రదేశంగా మారింది.

    కొంతమంది తైవాన్ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. జాతీయవాదం, పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2020లో నిర్వహించిన పోల్స్ ప్రకారం.. తైవాన్ వాసుల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం ‘తైవానీస్’ గానే పరిగణిస్తున్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము ‘చైనీయులు’గా భావిస్తున్నారు. తైవాన్ గుర్తింపు అనే బలమైన భావన.. చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది. తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవాన్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు.

    తైవాన్ వాసులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు. చాలా మంది తైవాన్ ప్రజలు “ఒక దేశం- రెండు వ్యవస్థలు” విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తైవాన్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత వాసులు.. చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు. పునరేకీకరణ తర్వాత తైవాన్కు స్వయంప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు విశ్వసించట్లేదు. ప్రత్యేకించి హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తిచూపుతున్నారు.

    చైనా కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్ ను.. తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్ గా పరిగణిస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇటీవల మాట్లాడుతూ.. తైవాన్ చైనాలో విలీనం కావాలని, అవుతుందని స్పష్టంగా చెప్పారు. చైనా ముందు నుంచి తైవాన్ ను చారిత్రాత్మకంగా తమ దేశంలోని ఒక భాగంగా పరిగణించింది. జాతీయత, ప్రాదేశిక సమగ్రత లక్ష్యాలుగా డ్రాగన్ కంట్రీ తైవాన్ పునరేకీకరణకు పావులు కదుపుతోంది.

    పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా శత వార్షికోత్సవం జరిగే 2049 నాటికి అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు జిన్ పింగ్. ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకొని “గ్రేటర్ చైనా” పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

    తైవాన్ కు స్వాతంత్ర్యం ప్రకటిస్తే.. జిన్ పింగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయవాదానికి అవరోధాలు ఎదురవుతాయి. ఇది టిబెట్, జిన్జియాంగ్లలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ డ్రాగన్  దేశానికి అమవానాలుగా మిగిలిపోతాయి. చైనా పునరేకీకరణ లక్ష్యాల్లో ప్రధానమైంది.. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం. దశాబ్దాలుగా తైవాన్ కు అమెరికా ఆర్థిక, సైనిక పరమైన మద్దతును అందించింది. అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ప్రకటిస్తే.. చైనా ప్రతిష్ఠకు భారీ నష్టం కలిగే అవకాశాలూ ఉన్నాయి.

    తైవాన్ పై చైనా దాడి చేస్తే.. రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ ప్రాంతానికి సాయం అందిస్తూనే ఉంది. సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో.. ఆర్థిక శక్తి, వ్యూహాత్మక, సైద్ధాంతిక కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు హామీ ఇస్తాయి. తైవాన్- అమెరికా సంబంధాల విషయంలోనూ ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అగ్రరాజ్యానికి తైవాన్ 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే.. 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, హైటెక్ పరిశ్రమ, సెమీకండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తోంది.

    దీనికి తోడు చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే.. తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని చైనా పెంచవచ్చు. ఇది చైనాను తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్య శక్తిగా మార్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఆ దేశం జపాన్ లేదా యూఎస్ ద్వీపం భూభాగమైన గువామ్పై దాడి చేయడం సులభం అవుతుంది. అందువల్ల తైవాన్పునరేకీకరణను అమెరికా సమర్థించట్లేదు. ఈ కారణాల వల్ల.. అన్ని విధాలుగా తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని అమెరికా భావిస్తోంది.

    ఒకవేళ చైనా తైవాన్ పై దాడి చేస్తే.. దాని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల చైనా ఆర్థిక, దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది. తైవాన్ సానుభూతిని పొందుతుంది. ఫలితంగా ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా చేసే ప్రయత్నాలకు విలువ లేకుండా పోతుంది.

    తైవాన్ అధికారికంగా స్వతంత్ర్యం ప్రకటించుకోవడం కూడా అసంభవమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చాలా మంది తైవాన్ ప్రజలు యథాతథ స్థితికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్య్రం ప్రకటించుకుంటే, చైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు చైనా తైవాన్ కంటే సైనికపరంగా ఎంతో ముందజలో ఉంది. దీనికి తోడు చైనా ఆ దేశంపై దండయాత్ర చేస్తే.. తాము రక్షిస్తామని అమెరికా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందువల్ల తైవాన్ సైతం స్వతంత్య్రాన్ని ప్రకటించుకోకపోవచ్చు. ఈ కారణాల వల్ల చైనా బెదిరింపులు కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశాలున్నాయి.

    భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడంపై తైవాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత్‌లో టీఎస్‌ఎంసీ- తైవాన్‌సెమీకండక్టర్‌మ్యానిఫ్యాక్చరింగ్‌కార్పొరేషన్‌రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది భారత్‌లోని పరిశ్రమలను మరోమెట్టు పైకి ఎక్కించే ఒప్పందం. చైనాకు ఈ ఒప్పందం ఏమాత్రం ఇష్టంలేదు. ఇటీవల  చైనా చొరబాట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణం.

    వాస్తవానికి ‘ఫస్ట్‌ఐలాండ్‌ఛైన్‌’గా వ్యవహరించే ప్రదేశంలో తైవాన్‌ఉంది. తైవాన్ కు జపాన్‌, ఫిలిప్పీన్స్‌, వియాత్నాం దేశాలకు అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తైవాన్‌లోని సెమీకండక్టర్‌పరిశ్రమపై ఈ దేశాలు భారీగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అమెరికా దళాలు కూడా ఉంటున్నాయి.

    తైవాన్‌ఆయుధాల్లో అత్యధికం అమెరికావే. గతేడాది తైవాన్‌62 బిలియన్‌డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి కొనేందుకు సిద్ధమైంది. దీనికి అప్పట్లో ట్రంప్‌పచ్చజెండా ఊపారు. తైవాన్‌కు ఆయుధాలు అమ్మడం అంటే… చైనాకు నిద్రను కరువు చేయడం వంటిదే.

    ఈ డీల్‌లో భాగంగా 66 అత్యాధునిక ఎఫ్‌యుద్ధవిమానాలు తైవాన్‌కు అందనున్నాయి. ఇప్పటికే 2019లో 90 విమానాలను ఆర్డర్ చేసింది. ఏడాది క్రితం మరో 66 విమానాలకు పచ్చజెండా ఊపింది.  తైవాన్‌ఆక్రమణ జరిగితే అమెరికా టెక్నాలజీతో చేసిన ఆయుధాలు చైనా చేతిలో పడతాయి. ఈ విషయం అమెరికా నేతలకు తెలుసు. అంతేకాదు అమెరికాను వెనక్కి నెట్టి చైనా సూపర్‌పవర్‌గా పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చుకొంటుంది. ఈ నేపథ్యంలో చైనా దూకుడును అగ్రరాజ్యం కట్టడి చేస్తుందన్న ఆశ తైవాన్‌మైదానంలో ఉంది.

    Trending Stories

    Related Stories