More

  భూటాన్ సరిహద్దుల్లో చైనా దురాక్రణమపై లుటియెన్స్ జర్నలిస్టులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?

  ఈ మధ్యకాలంలో కుక్కతోక వంకర అనగానే చాలా మంది నెటిజన్లు  ఓ.. పాకిస్తానా అంటూ ఆదేశ పేరును ప్రస్తావిస్తారు. అలాగే జిత్తులమారి గుంటనక్క… అనగానే చైనా అంటూ టక్కున ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ను పూర్తి చేస్తుంటారు. ఇంచుమించు ఈ రెండు దేశాల నైజం ఒక్కటే. పరుల భూమిని అప్పనంగా కాజేసేందుకు గోతికాడి నక్కలా కాచుకుని ఉంటాయి.

  నరమేధం సృష్టించినా సరే.. దానికో లెక్కుండాలని కమ్యూనిస్టుల చెబుతుంటారు. అందుకేనేమో.., చైనా దురాక్రమణవాదం కొంతమంది సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ రచయితలు, లుటియెన్స్ జర్నలిస్టులకు తప్పుగా తోచదు.!  పైగా అది దురాక్రమణకాదు… చైనా విస్తరణవాదం అంటూ  సిద్ధాంతీకరిస్తూ అంటూ జస్టిఫై చేస్తుంటారు.

  ఇదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా..! ఈశాన్యభారత సరిహద్దులలోని భూటాన్ దేశంపై చైనా కమ్యూనిస్టుల కళ్లు పడ్డాయి. భూటాన్ తో ఉన్న సరిహద్దుల హద్దులను రాత్రికి రాత్రే అక్రమంగా  చెరిపివేస్తోంది చైనా. తాజాగా భూటాన్ సరిహద్దుల్లోకి చొరబడటమే కాకుండా ఏకంగా ఒక చిన్నసైజు పట్టణాన్నే నిర్మించేస్తోంది కమ్యూనిస్టు చైనా.

  ఆస్ట్రేలియాకు చెందిన సైట్ న్యూస్.కామ్ అనే వెబ్ పోర్టల్.. భూటాన్ సరిహద్దుల్లో చైనా జరుపుతున్న సైలెంట్ దురాక్రమణకు సంబంధించిన సమగ్ర కథనాన్ని పబ్లిష్ చేసింది. చైనా ఆక్రమణలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను సైతం తన కథనానికి జత చేసింది.

  చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వారి దురాక్రమణవాదం కూడా మొదలైంది.1950లో శాంతికాముక దేశం టిబెట్ ను ఆక్రమించుకున్న చైనా కమ్యూనిస్టులు అక్కడ నరమేధం సృష్టించారు. ఆ తర్వాత టిబెన్ అటానమస్ రీజియన్-TAR ను ఏర్పాటు చేసి నియంతృత్వ పాలనను మొదలు పెట్టారు.

  టిబెట్ తో సరిహద్దులను పంచుకుంటున్న దేశాల సరిహద్దులను చెరిపివేస్తూ ఆయా ప్రాంతాల్లోకి చొచ్చుకు రావడం.., ఆ ప్రాంతాలు మావేనంటూ వివాదాస్పదం చేయడం చైనా దురాక్రమణవాదంలో ఒక భాగం.

  మొన్నటికి మొన్న లద్దాక్ తూర్పు సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసింది. గల్వాన్ లోయలో జరిగిన పోరులో భారత సైనికులు గట్టిగా బుద్ది చెప్పడంతో వెనక్కి తగ్గింది. అలాగే అంతకు ముందు 2017లో డోక్లామ్ పీఠభూమిలోకి చొరబడింది చైనా. భారత సరిహద్దుల వరకు రోడ్డు వేసేందుకు ప్రయత్నించింది. చైనా దుందుడుకు చర్యలను భారత బలగాలు గట్టిగానే అడ్డుకున్నాయి. రెండు దేశాల మధ్య దాదాపు 73 రోజులపాటు ప్రతిష్ఠంభన కొనసాగింది. ఒక దశలో రెండు దేశాల సైనికులు ఆయుధాలు లేకుండా ముఖముఖి పోరాటానికి సైతం సిద్ధపడ్డారు. చివరకు వెనక్కి తగ్గిన చైనా… భూటాన్ నైరుతి సరిహద్దులపై దృష్టి పెట్టింది.

  భూటాన్ లోని లుంట్సే జిల్లాలో అంతర్భాగమైన గయాలాఫగ్ అనే ప్రాంతంలో ఒక చిన్న సైజ్ పట్టణాన్ని సైలెంట్ గా నిర్మిస్తోంది చైనా. 232 చదరపు మైళ్ల విస్తర్ణంలో తిష్టవేసిన చైనా…,  అక్కడ ఒక చిన్న హైడ్రోపవర్ స్టేషన్, కమ్యునికేషన్ సెంటర్, సైనిక పోస్టులు, శాటిలైట్ రిసివ్ స్టేషన్, వంటిని వాటిని నిర్మిస్తోంది.

  అంతేకాదు భూటాన్ చుట్టూ సైనిక కేంద్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. ఈ ఆక్రమణల కంటే ముందు భూటాన్ తో దౌత్యపరమైన సంబంధాల పేరుతో భూటాన్ ను గుప్పిపట్టేందుకు కుట్రలు చేసింది. భూటాన్ రాజధాని థింపులో చైనా తన రాయబార కార్యాలయం ఏర్పాటు చేసేందుకు మొదట ప్రయత్నాలు చేసింది.

  అయితే చైనాతో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకునేందుకు భూటాన్ నిరాకరించింది. దీంతో భూటాన్ కు టిబెన్ కు ఉన్న సరిహద్దుల ఆనవాళ్లను మార్చేస్తూ.., ఆయా ప్రాంతాలను వివాదాస్పదం చేస్తూ..వాటిల్లో పీఏల్ఏ సైనిక బలగాల మోహరింపులకు అనుగుణంగా చైనా ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతోంది.

  చైనా జరుపుతున్న ఈ దురాక్రణలపై మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రణ చేస్తోందని.., ఆ దేశ భూభాగాలను ఆక్రమంగా ఆక్రమించిందని కథనాలు.., స్పెషల్ స్టోరీలు రాసిన ఈ మీడియా చానళ్లు… ఎందుకని శాంతికాముక దేశమైన భూటాన్ కు అండగా నిలబడటం లేదు? దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచిచండి. ఎవరు చైనా హితం కోసం ఆలోచిస్తున్నారో ఇప్పటికైనా గుర్తించండి.   

  Trending Stories

  Related Stories