కరోనా మహమ్మారిని ఇప్పటికే చైనా ప్రపంచం మీదకు వదిలింది. చైనానే కరోనా వైరస్ ను తయారు చేసిందని ప్రపంచ దేశాలకు చెందిన ఎన్నో ఏజెన్సీలు చెబుతూ ఉన్నాయి. కరోనా ఎక్కడ పుట్టిందనే వివరాలను తేల్చకపోతే కొవిడ్ 26, కొవిడ్ 32 ముప్పు కూడా ముంచుకొస్తుందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్ డీఏ) కమిషనర్ గా, ఇప్పుడు ఫైజర్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్కాట్ గాట్ లీబ్, టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్ మెంట్ కో– డైరెక్టర్ పీటర్ హొటెజ్ లు సంచలన వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ తయారైందనడానికి ఎన్నో ఆధారాలున్నాయని.. అది అబద్ధమని చెప్పే ఆధారాలను మాత్రం చైనా చూపించలేకపోయిందని అన్నారు. దాని పుట్టుక గురించి తెలియకపోతే ప్రపంచానికి మరిన్ని ముప్పులు తప్పవని అన్నారు. గబ్బిలాలను తినడం వలన చైనాలో మనుషులకు కరోనా సంక్రమించిందని అంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టులు, వైరాలజిస్టులు, గబ్బిల జాతుల పరిశోధకులు హ్యూబెయ్ ప్రావిన్స్ లో కరోనా పుట్టుకపై అధ్యయనం చేయించాలని సూచించారు. కరోనా పుట్టుకను కనిపెట్టకపోతే మానవాళికే ప్రమాదమని హెచ్చరించారు.
ఓ వైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతూ ఉంటే మరో ఉపద్రవాన్ని చైనా ప్రజల మీదకు తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకూ బర్డ్ ఫ్లూ కేవలం పక్షుల్లో మాత్రమే ఉండగా.. ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి సోకింది. అది కూడా చైనాలోనే మనిషికి సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించేసింది. చైనాలో అదే చోటు చేసుకుంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం రోజుల క్రితం అతడికి రక్త పరీక్షలు చేయగా బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని.. అతడిలో హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని చైనా వైద్యారోగ్య శాఖ తెలిపింది. బాధితుడికి అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అతడు ఇటీవల ఎవరెవరిని కలిశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే ప్రపంచంలో ఇంతకు ముందెప్పుడూ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది లేదు.. ఇప్పుడు తొలిసారి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడమే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూ ఉంది. చైనా ఇంకెన్ని ఉపద్రవాలను మనుషుల మీదకు తీసుకుని వస్తుందా అనే కలవరం అందరిలోనూ మొదలైంది.