చైనా భారతదేశ సరిహద్దుకు దగ్గరగా ఉన్న టిబెట్‌లోని హిమాలయ ప్రాంతంలో బుల్లెట్ రైలును ప్రారంభించింది. బుల్లెట్ రైలు ప్రాంతీయ రాజధాని లాసాను నియింగ్చికి కలుపుతుంది. ఇది చైనా తీసుకున్న వ్యూహాత్మకంగా నిర్ణయం. టిబెట్ లోని మెడోగ్ నగరం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఆనుకొని ఉంది. ఈ కారిడార్ పొడవు 435.5 కిలోమీటర్లు. సిచువాన్-టిబెట్ రైల్వేలో ఒక భాగం. ఇది సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డు నుండి ప్రారంభమై యాన్ గుండా ప్రయాణించి టింబెట్లోకి కమ్డో కు చేరుకుంటుంది. చెంగ్డు నుండి లాసా వరకు ప్రయాణ కాలాన్ని 48 గంటల నుండి 13 గంటలకు ఈ రైలు ప్రయాణం కుదించింది.
అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నియింగ్చి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ రైలు మార్గం 435.5 కిలోమీటర్ల దూరం ఉంది. జూలై ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఈ రైలు మార్గాన్ని ఆవిష్కరించగా నేడు ప్రారంభించారు. ఫుక్సింగ్ బుల్లెట్ రైలును ఈ కొత్త రూట్లో నడిపించారు. ఖిన్‌ఘాయి-టిబెట్ రైల్వే మార్గం ను ఇంతకు ముందు వాడగా.. ఇప్పుడు సిచువాన్-టిబెట్ రైల్వే మార్గాన్ని వినియోగించారు. సరిహద్దుల రక్షణ అంశంలో కొత్త రైల్వే లైన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తమ భాగమేనని చైనా చెబుతోంది. యుద్ధ సామగ్రి, ఆయుధాలు, సైన్యాన్ని సరిహద్దులకు ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా వేగంగా చేరవేయొచ్చని షింగ్వా యూనివర్సిటీలోని నేషనల్ స్ట్రాటజీ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ విభాగ డైరెక్టర్ ఖియాన్ ఫెంగ్ చెప్పారు.
సరిహద్దులోకి సైన్యాన్ని తరలించవచ్చన్నదే చైనా ఈ రైల్వే మార్గాన్ని తీసుకుని వచ్చినట్లు చెబుతూ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెబుతూ చైనా ఓ వైపు రచ్చ చేస్తూనే ఉంది.. మరో వైపు భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి కుయుక్తులు పన్నుతోంది. రెండేళ్ల క్రితం డోక్లాం వద్ద సైన్యాన్ని చైనా మోహరించింది. అందుకు దీటుగా భారత్ కూడా మోహరింపులు చేసింది. ఆ తర్వాత గాల్వాన్ లోనూ ఘర్షణకు దిగింది.