More

    చైనా నగరాల్లో మరోసారి కరోనా పంజా.. వ్యాక్సినేషన్ కోసం భారీగా క్యూలు

    కరోనా మహమ్మారి విషయంలో చైనా మొదటి నుండీ అబద్ధాలను చెబుతూనే ఉంది. కరోనా మహమ్మారిని వుహాన్ ల్యాబ్ లో పుట్టించి ప్రపంచం మీదకు వదిలారని అమెరికా కూడా చెబుతోంది. కరోనాను బయో వార్ లాగా ప్రపంచం మీదకు వదలాలని చైనా ఎప్పటి నుండో ప్లాన్ చేసిందనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. ఇక వ్యాక్సినేషన్ విషయంలో కూడా చైనా అబద్ధాలను చెబుతూ ఉంది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున ఇచ్చేసినట్లు కూడా చెబుతోంది. ప్రపంచానికి ఇక తమ దేశంలో కరోనా ప్రభావమే లేదని.. వ్యాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోందనే బిల్డప్ ఇస్తోంది. కానీ అక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోడానికి ప్రజలు అసలు ముందుకు రావడం లేదు.. ఇంకొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కోసం వందల మంది క్యూలలో నిలబడ్డారు.

    చైనా ప్రభుత్వం చెబుతున్నంత గొప్పగా అక్కడి పరిస్థితులు లేవని తాజాగా కొన్ని వీడియోలు బయటకు రావడంతో స్పష్టంగా తెలిసిపోతోంది. చైనా ప్రజలకు వ్యాక్సిన్లు వేయడానికి అక్కడి ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడుతూ ఉంది. తాజాగా ట్విట్టర్ లో చైనా మానవహక్కుల కార్యకర్త ఓ వీడియోను అప్లోడ్ చేశారు. అందులో వందల మంది వ్యాక్సిన్లు వేయించుకోడానికి క్యూలలో నిలబడ్డారు. జిజియాన్ కౌంటీ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ కోసం తోసుకోవడాన్ని గమనించవచ్చు.

    పోర్టు సిటీ అయినా గ్వాంగ్జోవ్ నగరంలో కూడా పొడవైన క్యూ లైన్ వ్యాక్సిన్ కోసం ఉండడాన్ని చూడొచ్చు. ఓ వ్యక్తి తన సైకిల్ పై వెళుతూ ఉండగా.. మొత్తాన్ని రికార్డు చేశాడు. 2:12 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఆసుపత్రి బయట ఉన్న క్యూ లైన్ ను చూడొచ్చు. అక్కడ కొన్ని వేలమంది వ్యాక్సిన్ వేయించుకోడానికి ఎదురుచూస్తూ ఉన్నారు.

    చైనాలోని పలు నగరాల్లో కరోనా ఉధృతి:

    కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని చైనా ప్రభుత్వం చెబుతున్నా.. పలు నగరాల్లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని తెలుస్తోంది. గ్వాంగ్జోవ్ లో కరోనా కేసుల ఉధృతి మొదలవ్వడంతో ప్రజలు వ్యాక్సిన్ సెంటర్లకు ఎగబడ్డారు. దీంతో ప్రజలు వీధుల్లోకి రావద్దని సూచిస్తూ ఉంది. ఇళ్లలోనే ఉండాలని చెబుతూ ఉంది. ఒక్కో ఇంటి నుండి కేవలం ఒక్కరు మాత్రమే బయటకు రావాలని గ్వాంగ్జోవ్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

    కరోనా వైరస్ తిరిగి చైనా విజృంభిస్తూ ఉండడంతో ఆ దేశం తీసుకుని వచ్చిన వ్యాక్సిన్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. చైనా వ్యాక్సిన్లు కరోనాను కట్టడి చేస్తాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. చైనాను నమ్మి ఇప్పటికే కొన్ని దేశాలు ఆ దేశ వ్యాక్సిన్ లను తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వ్యాక్సిన్ పై ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నాయి.

    Trending Stories

    Related Stories