International

అమెరికా మీడియాకు చైనా డైలీ ఎందుకు డబ్బులు వెదజల్లుతోంది?

ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఫిల్లర్ మీడియానేనని చాలా మంది ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే ఇదంతా బూటకమనే వారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో, ప్రజాస్వామ్యానికి కంటే కూడా, బడా బడా కార్పొరేట్ శక్తులకు…, అలాగే పాలక వర్గాలకు బాకాలుదే బ్రాండ్ గా మీడియా మారిపోయిందని., ఒక దశలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వేదంగా పలికిన విషయాన్ని మనం మార్చిపోరాదు. వరల్డ్ వైడ్ గానే కాదు.., ఇటు భారత్ లో కూడా…, మీడియా అంటే కార్పొరేట్ శక్తుల లాబీయింగ్ లకు, అలాగే తమతోపాటు తమకు వంతపాడే పాలక వర్గాల.., ప్రయోజనాలను కాపాడే సాధనంగా మారిందని అంటారు.
చైనా లోని వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా కీటకం బయటకు వచ్చిందని ప్రపంచమంతా అంటోంది. అయితే మన పత్రికలు, మీడియా మాత్రం దానిని చైనీస్ వూహాన్ వైరస్ అనేందుకు జంకుతున్నాయి. చైనీస్ వైరస్ అనే పదాన్ని ఉచ్చరించేందుకు కూడా ముందుకు రావడం లేదు. పైగా ఆ వైరస్ కు చైనాకు ఏం సంబంధం అంటూ దాని వైపునే వకల్తా పుచ్చుకున్నట్లుగా వాదిస్తున్నారు. ఒకే… చైనీస్ వైరస్ అనవద్దు…! మరి అదే సమయంలో ఇండియన్ వైరియంట్ అంటూ ఈ లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు హెడ్డింగులు పెడతారు.
అంతేకాదు చైనా దేశం…, కమ్యూనిస్టు నరహంతక మూఠాల చేతుల్లోకి వెళ్లి వందేళ్లు పూర్తి అయ్యింది. దీనికి మన తెలుగు పత్రికలు అయితే చైనా కమ్యూనిజాన్ని, నిరంకుశుడైన మావోను కీర్తిస్తూ ఒక రేంజ్ కవరేజ్ ఇచ్చాయి. వందేళ్ళ పిడికిలి, ఒక స్వప్నం..ముగ్గురు మొనగాళ్ళు ఇలా రకరకాల హెడ్డింగులతో చైనా కమ్యూనిస్టులను కీర్తిస్తూ ఈ పత్రికల కథనాలు సాగాయి.
ఇలా ఒక్క భారత్ లోనే కాదు… ప్రపంచ మంతటా..ముఖ్యంగా వరల్డ్ పోలీస్ గా వ్యవహారించే అమెరికాలో సైతం కమ్యూనిస్టు చైనా ప్రయోజనాలకు వంతపాడే మీడియా, పత్రికలు ఉన్నాయని తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్, ఎన్ వైటీ, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు గత కొన్నేళ్లుగా చైనాకు వత్తాసు పలుకుతు అనేక కథనాలను ప్రచురిస్తున్నాయి. పనిలోపనిగా భారత్ పై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి.
నిజానికి ప్రస్తుతం చైనా అనుసరిస్తున్న విస్తరణవాద వ్యూహాన్ని , తనదైన పక్కా ప్లాన్ తో, అడ్డుకుంటున్న ఏకైక దేశం.., భారత దేశం మాత్రమే.! భూటాన్ సరిహద్దులోని డొక్లామ్ ఫ్రంట్ లోనైనా, అటు తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయ లోనైనాను సరే.., చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కొని గట్టిగా బుద్దిచెప్పింది భారత సైన్యం.!
అయితే అంతర్జాతీయంగా చైనాకు దీటుగా ఎదుగుతున్న భారత్ ను చూసి.., వైట్ మెన్ సుప్రీమసీని బలంగా నమ్మే యూరోపియన్ జర్నలిస్టులు, అటు అమెరికన్ జర్నలిస్టులు, అక్కడి మీడియా భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీపై , అలాగే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ వరల్డ్ మీడియా వర్చర్ మీడియాగా మారి భారత్ ను బద్నామ్ చేసేందుకు అనేక తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. అనేకమంది నెటిజన్లు సైతం తమదైన పరిశోధనల ద్వారా చైనా కు వంతపాడే శక్తుల బండారాన్ని బయటపెట్టారు కూడా. అలాగే మన దేశంలోని కొంతమంది లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులు.. మీడియా చానళ్లు ఈ విదేశీ శక్తుల కుట్రలకు వంతపాడుతూ భారత్ పై తప్పుడు కథనాలను వ్యాపింపజేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
మరోవైపు భారత్ పై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నందుకా అన్నట్లుగా యుఎస్ దినపత్రికలకు చైనా నుంచి భారీ మొత్తంలో యాడ్స్ పేరుతో ముడుపులు అందుతున్నట్లుగా ఓపీ ఇండియా వంటి జాతీయవాద వెబ్ పోర్టర్ బయటపెట్టడంతో…చైనాపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. గత కొన్ని నెలలుగా అమెరికాలోని ప్రముఖ వారపత్రికలతోపాటు దినపత్రికలకు చైనా డైలీ మిలియన్ డాలర్ల నిధులను యాడ్స్ రూపంలో చెల్లించినట్లుగా తెలుస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉండే ఇంగ్లీష్ వారపత్రిక చైనా డైలీ నుంచి టైమ్ మ్యాగజైన్, ఫారిన్ పాలసీ మ్యాగజైన్, ఫైనాన్షియల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి అమెరికన్ పత్రికల లక్షల డాలర్లు చెల్లించినట్లుగా యుఎస్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఒక నివేదికను రూపొందించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
టైమ్స్ మ్యాగజైన్ కు 7,00,000. ఫైనాన్సియల్ టైమ్ కు 13,71,577. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ కు 12,91,000. అలాగే లాస్ ఏంజిల్స్ టైమ్స్, ఇంకా ఇతర మీడియా ప్రచురణలకు ఒక మిలియన్ డాలర్లు వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి.చైనాలో నిషేధించబడిన మైక్రోబ్లాగింగ్ సైట్లలో ట్విట్టర్ కూడా ఒకటి. అయితే ఏం జరిగిందో తెలియదు కాదు కానీ.., చైనా కమ్యూనిస్టులు మాత్రం ట్విట్టర్ కు ప్రకటనల వర్షం కురిపించారు. ఏకంగా దాని కోసం 52,65,822 డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ఫారిన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చైనా డైలీలో తన ఖర్చులు, కార్యకలాపాల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ళుగా ఈ వివరాలను వెల్లడించాలని న్యాయశాఖ కూడా కోరుతూ వస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో.., 2016 నవంబర్ నుంచి 2020 ఏప్రిల్ మధ్య కాలంలో ఖర్చు చేసిన వివరాలను చైనా డైలీ వెల్లడించింది.
అంతేకాదు మన దేశంలో జులై 1వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తమ శతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా… మన దేశంలోని ది హిందూ పత్రికకు కోట్లాది రూపాయల ఫ్రంట్ పేజీ యాడ్స్ ను ప్రభుత్వం ఇచ్చింది. (ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ది హిందూ అంటే ఇదేదో ప్రొ హిందూ పత్రిక అనుకుంటే పొరపాటు. ఈ పత్రిక పేరుకు మాత్రమే హిందూ, అందులో ప్రచురితమయ్యే రాతలు అన్ని కూడా కమ్యూనిస్టులకు వంతపాడేవేనని మనం మర్చిపోరాదు.) అలాగే మావో జెడాంగ్ తర్వాత అంతటి కమ్యూనిస్టు నిరంకుశ పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్న షి జిన్ పింగ్ ను, చైనాను కీర్తిస్తూ హిందూ పత్రిక సంపాదకీయాలు కూడా రాసింది.
ఇక మరోక విషయం.! ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక అయితే తమ పత్రికకు సంబంధించి సౌత్ ఏసియా బిజినెస్ కరస్పాండెంట్ జాబ్ కోసం ఒక విచిత్రమైన ప్రకటనను జారీ చేసింది. తమ పత్రికలో జాబ్ కావాలంటే.., భారత్ లో నేషనలిస్ట్ ప్రభుత్వాన్ని , అలాగే పీఎం నరేంద్రమోదీని వ్యతిరేకించే వారికే ప్రాధాన్యం అంటూ ఓ ప్రకటన చేసింది. అంటే.. భారత్ లో జాతీయవాదాన్ని వ్యతిరేకించే ఏజెంట్లకు, తప్పుడు ప్రచారంలో చేయడంలో చేయి తిరిగిన తుక్డే తుక్డే గ్యాంగులకు, NYT పత్రిక ఎలాంటి సంకోచం లేకుండానే డైరెక్టుగానే ఉద్యోగాల ఆఫర్ చేసిందన్నమాట.!
దేశ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించడండి. ఎవరు చైనా భక్తులో గుర్తించండి. జాతీయవాద జర్నలిజాన్ని పోత్సహించండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eight − 3 =

Back to top button