International

చైనా మర్షల్ ఆర్ట్స్ సెంటర్ లో ఘోర అగ్ని ప్రమాదం

చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలోని ఝెచెంగ్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

హెనాన్ ప్రావిన్స్‌లోని మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. కనీసం 18 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికి ఆరిపోయినట్లు జెచెంగ్ కౌంటీ ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. 16 మందికి గాయాలయ్యాయని, వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కౌంటీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఏ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ అనే పేరును వెల్లడించలేదు.

చైనాలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం. సేఫ్టీ ప్రోటోకాల్స్ సరిగా పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇదే ప్రావిన్స్ లో 2000 లో క్రిస్మస్ రోజున లుయోయాంగ్ నగరంలో చెలరేగిన మంటల్లో 309 మంది మరణించారు. నైట్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తుండగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అందరూ మరణించారు. బాధితులలో చాలా మంది డ్యాన్స్ హాల్‌లో ఊపిరి ఆడక మరణించారు. ఎంతో మంది పట్టే డ్యాన్స్ హాల్ కు కేవలం రెండు అత్యవసర నిష్క్రమణలు మాత్రమే ఉన్నాయి. ఎటువంటి స్ప్రింక్లర్లు, అలారాలు అసలు లేకపోవడంతో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 19 =

Back to top button