International

చైనాలో మళ్లీ మొదలైన కరోనా కలకలం.. పెద్ద పెద్ద నగరాలు లాక్ డౌన్

కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా కేసుల పెరుగుదల మొదలైంది. తాజాగా లాన్‌జువో నగరమంతటా లాక్‌డౌన్‌ విధించింది. సోమవారం ఒక్కరోజునే చైనా వ్యాప్తంగా 39 కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌ ప్రబలుతుండటంతో గడిచిన వారంలోనే వంద కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల మొదలవ్వడంతో చైనా గన్సు ప్రావిన్స్ యొక్క రాజధాని నగరమైన లాన్‌జువో లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవలి కాలంలో అక్కడ కోవిడ్ కేసులు ఎక్కువగా పెరగడానికి డెల్టా వైరస్ కారణంగా చెబుతున్నారు. నలభై లక్షల జనాభా ఉన్న ఈ సిటీలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ కట్టడికి అధికారులు కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. నగరవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు.

ఇంతకుముందు చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలోని ఎజిన్ కౌంటీలో కూడా కరోనా కేసులు వచ్చాయి. 35,700 మంది నివాసితులు ఉన్న ఈ ప్రాంతంలో కోవిడ్ కేసులు పెరగడంతో సోమవారం నుండి ఇంట్లోనే ఉండాలని కోరారు. ఎజిన్ కౌంటీ కొత్తగా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్‌గా పరిగణించబడుతోంది. ఇన్నర్ మంగోలియా చుట్టూ ఉన్న ప్రావిన్స్ లో కరోనా వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

నాలుగు మిలియన్ల జనాభా కలిగిన లాన్‌జువోలో కొత్తగా ఆరు ఇన్‌ఫెక్షన్‌ లు నమోదయ్యాయి. లాన్‌జువో నివాసితులు ఇంట్లోనే ఉండాలని.. ప్రాంతం లోకి వచ్చే వాళ్లు, వెళ్లే వాళ్ళ గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. వైద్య చికిత్సల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని చైనా అధికారులు తెలిపారు. చైనా ప్రభుత్వం కోవిడ్ తో సహజీవనం చేయాల్సిందేననే విషయాన్ని అసలు పట్టించుకోలేదు.. దాని వ్యాప్తిని అరికట్టడానికి నియంత్రణ చర్యలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ.. చైనా జనాభాలో 75.6% మందికి పూర్తిగా టీకాలు వేశామని అన్నారు. అలాగే ప్రజలకు బూస్టర్ షాట్‌లను కూడా ఇచ్చినట్లు తెలిపారు. చైనా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌లపై కూడా అనుమానాలు ఉన్నాయి. చైనీస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను తీసుకున్న మంగోలియా, సీషెల్స్ వంటి దేశాలు కూడా ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల ఉంది.

Related Articles

Back to top button