అస్సాం రైఫిల్స్ యూనిట్‌ పై ఉగ్రదాడి.. చైనా లింకులు స్పష్టంగా బయట పడ్డాయి

0
700

నవంబర్ 13న.. మయన్మార్ సరిహద్దులోని మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. మరణించిన వారిలో కమాండింగ్ ఆఫీసర్, అతని భార్య, వారి 6 ఏళ్ల కుమారుడు మరియు 46 అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు సైనికులు ఉన్నారు. చైనా ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్లు స్వరాజ్య పత్రిక నివేదికలో పేర్కొంది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్ PLA(M), మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (MNPF) ఈ దాడికి బాధ్యత వహించాయి. PLA(M) కు చైనాతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. గతంలో చైనా నుండి సహాయం పొందడమే కాకుండా.. భారత్ పై దాడుల విషయంలో ప్రోత్సాహాన్ని కూడా అందుకున్నారు.

అస్సాం రైఫిల్స్‌ మాజీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) షోకిన్‌ చౌహాన్‌ స్వరాజ్యతో మాట్లాడుతూ “ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు గ్రూపులకు చైనా చాలా కాలంగా ఆయుధాలు అందిస్తోంది. గెరిల్లా వ్యూహాలు రచించడం లోనూ సురక్షిత ప్రాంతాల్లో సైద్ధాంతిక శిక్షణను అందించింది. ఈ సంస్థల నాయకులు చాలా మంది చైనాకు వెళ్లారు.. చైనా సైనిక లీడర్లు మరియు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉన్నారు.

మణిపూర్‌కు చెందిన భారత సైన్యంలోని మొదటి త్రీ-స్టార్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కొన్సామ్ హిమాలయ్ సింగ్ మాట్లాడుతూ, బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్న సమయంలో మణిపూర్‌లో ఉగ్రవాదులు తమ ఉనికిని ప్రపంచానికి తెలియజేయడానికే శనివారం నాడు ఆకస్మిక దాడి చేశారని అన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు మంటలను రేకెత్తించడంలో చైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కొన్సామ్ హిమాలయ్ సింగ్ అన్నారు. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటులు ఎక్కువగా లేనప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చురుకుగా ఉన్న ఏకైక రాష్ట్రం మణిపూర్ మాత్రమే అని వివరించారు. ఆకస్మిక దాడులు మరియు శనివారం జరిగినటువంటి హై-ప్రొఫైల్ దాడులు ఈ తిరుగుబాటు గ్రూపులకు చాలా అవసరమైన ప్రచారాన్ని తెస్తాయని అన్నారు.

మణిపూర్‌లోని PLA మరియు ఇతర తిరుగుబాటు గ్రూపులు చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయని, ఆయా తీవ్రవాద సంస్థల నాయకులు చైనాతో క్రమం తప్పకుండా కమ్యూనికేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఆకస్మిక దాడిలో చైనా ప్రమేయం ఉందనే బలమైన అనుమానాలతో పాటు, 46 అస్సాం రైఫిల్స్ బెటాలియన్ (హత్యకు గురైన కల్నల్ విప్లవ్ త్రిపాఠి నేతృత్వంలో) నిర్వహించిన ఆపరేషన్లు వివిధ తిరుగుబాటుదారులకు చాలా ఇబ్బందులు కలిగించాయని తెలిపారు.

46 అస్సాం రైఫిల్స్ పోరస్ ఇండో-మయన్మార్ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకున్నాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలను ఛేదించాయి. తిరుగుబాటుదారులు ఈ డ్రగ్స్ దందాలను నడుపుతున్నారు. డ్రగ్స్ వారి ప్రధాన ఆదాయ వనరు. కల్నల్ త్రిపాఠి ఈ ఆదాయ వనరులను నిలిపివేసినందున తిరుగుబాటు సంస్థలు బాధపడ్డాయి. అందుకే అతన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. మణిపూర్ మయన్మార్‌తో 398 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంది. అది కంచెలు లేని ప్రాంతం. సింగిల్-లేన్ రహదారి కూడా మాదకద్రవ్యాలను రవాణా చేస్తుంటాయి కొన్ని గ్రూపులు.. వారిని భారత సైనికులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంటుంది.

ఇటీవల జరిగిన దాడికి సంబంధించి ఉగ్రవాదులు కాన్వాయ్‌పై మొదట ఐఈడీ పేలుడు జరిపారు. ఆ తర్వాత కాల్పులు జరిపారు. డిప్యుటేషన్‌పై 46 అస్సాం రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కల్నల్ విప్లవ్ త్రిపాఠి మయన్మార్ సరిహద్దులోని తన కమాండ్ పోస్ట్‌లలో ఒకదాని నుండి తిరిగి వస్తుండగా దాడి జరిగింది. ఉగ్రదాడిలో మరణించిన నలుగురు జవాన్లు క్విక్ రెస్పాన్స్ టీమ్‌కు చెందినవారు. ఆకస్మిక దాడి ప్రదేశాన్ని సందర్శించిన అస్సాం రైఫిల్స్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (బ్రిగేడియర్) మాట్లాడుతూ తీవ్రవాదులు కల్నల్ త్రిపాఠి కార్యకలాపాలను జాగ్రత్తగా గమనించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కమాండింగ్ ఆఫీసర్ తన భార్య మరియు కొడుకుతో ప్రయాణిస్తున్నారని మిలిటెంట్లకు తెలియకపోవచ్చు అని అధికారి చెప్పారు. ఓ సైనికుడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి ద్వారా రెడ్ లైన్‌ను దాటారని ఆయన తేల్చిచెప్పారు. తీవ్రవాదులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు.