More

    భవిష్యత్ భారత్ దే.. భయపడుతున్న డ్రాగన్ దేశం..!

    చైనా దేశం భారత్ కు శత్రు దేశాల్లో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ తర్వాత ఇండియా కు డ్రాగన్ దేశం నుంచే ప్రమాదం పొంచి ఉంది. ఐతే భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్న దేశం. టెక్నికల్ పీపుల్ ఎక్కువగా ఉన్న దేశం. జనాభా కూడా ఎక్కువ ఉన్న దేశం. కాబట్టి ఇక్కడ లేబర్లు కూడా చీపుగా దొరుకుతారు. అందుకనే ప్రత్యేకించి చాలా దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉంటాయి. ఇలాంటి విశేషాలు, ప్రత్యేకతలు భారత్ లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉన్న దేశం కాబట్టే డ్రాగన్ దేశంతో పోలిస్తే, ప్రపంచానికి బెటర్ ఆప్షన్ అయ్యింది. కాబట్టే ఇక్కడికి పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వస్తారు. చైనాకు భారతదేశం అంటే ఒక భయం ఉంది. అందుకే ఎప్పుడూ కుట్రలు చేస్తూ ఉంటుంది.

    పాకిస్తాన్ తీవ్రవాదులకు చందాలు ఇచ్చి పోషించే దేశాల్లో చైనా కూడా ఒకటి. ఒకరకంగా భారతదేశంపై తనకున్న అసూయతో, పాకిస్తాన్ కు భారత్ పై ఉన్న ద్వేషాన్ని ఉపయోగించుకుని భారత్ పై కయ్యానికి కాలు దువ్వేలా చేస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలను భారత్ నిఘా సంస్థలు కష్టపడి పట్టుకుంటే.. వాళ్ల మీద ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుకునేది చైనానే. భారతదేశం ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు, ఇంకా కాశ్మీర్ సమస్యల మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉంటే చైనా వన్ మాన్ ఆర్మీల అభివృద్ధి చెందే పరిస్థితి భవిష్యత్తులో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది.

    చైనాలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే సంస్థలు చాలా వరకూ ఇప్పుడు చైనాను కాకుండా, అక్కడ నుండి భారత్ వైపు చూస్తున్నాయి. దాంతో భారతదేశం భవిష్యత్తు బాగుంటుందని తెలుస్తుంది. అందువల్ల భారతదేశానికి చైనా నుండి పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇకపై చైనా ఎక్కువకాలం అభివృద్ధి దిశలో నడవలేదు. చైనా అభివృద్ధి ఈ మధ్యకాలంలో బాగా సన్నగిల్లింది. కాగా భారతదేశం అభివృద్ధి దిశలో ముందుకు వెళుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఈ మధ్యన బాగా క్షీణిస్తే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అంచనాలకు మించి అభివృద్ధి చెందుతుంది. ఇకపై భవిష్యత్తు అంతా భారతదేశందే అని ప్రముఖ ఎకనమిస్టులు చెబుతున్నారు.

    2020 మార్చి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఇండియాను కరోనా వణికించేసింది. ఒక్క ఇండియాయే ఏమిటి ? ప్రపంచ దేశాల ఎకానమీలన్నీ అప్పుడు దాదాపు చతికిలబడ్డాయి. వాటి ఆర్ధిక వ్యవస్థలు సాయం కోసం అల్లాడాయి. చైనా ఎకానమీ అయితే మరీ దిగజారింది. కానీ భారత్ విషయం వేరు.. అంతగా కరోనా విజృంభించినా కేంద్ర ప్రభుత్వం మెల్లగా తన ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసుకుంటూ వచ్చింది. ఏ మాత్రం బిగి సడలనివ్వకుండా తన ఆర్థిక విధానాలను సవరించుకుంటూ వచ్చింది.

    కోవిడ్ ని జీరో స్థాయికి తెచ్చేందుకు జీ జింగ్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను పాటించడంతో దాని ఎకానమీ కుంచించుకుపోయింది. ఆ దేశ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు చతికిలపడ్డాయి. తైవాన్ పట్ల ఆ దేశం అనుసరిస్తున్న అధ్వాన్నపు విధానాలు, క్వాడ్ దేశాలంటే చిన్న చూపులాంటి కారణాలు చైనా ఎకానమీని దెబ్బ తీశాయి. బీజింగ్ పరిస్థితి కూడా శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, కెన్యా దేశాల ఆర్ధిక వ్యవస్థల మాదిరే తయారయింది.

    Trending Stories

    Related Stories