More

    ఇప్పుడు వియత్నాం భూభాగంపై చైనా చూపులు

    చైనా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలని ఎన్నో పన్నాగాలను పన్నుతూ ఉంది. ఇప్పటికే టిబెట్, హాంగ్ కాంగ్ లపై తమ దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న చైనా.. ఇప్పుడు వియత్నాం భూభాగంపై కూడా పడింది. వియ‌త్నాం భూభాగాన్ని ఆక్ర‌మించ‌డానికి చైనా ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వియ‌త్నాం ప్రజలపై చైనా సైనికులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర వియ‌త్నాంలోని గియాంగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జ‌న‌వ‌రి 3న వియ‌త్నాం కార్మికుల‌పై చైనా సైనికులు రాళ్లు రువ్వార‌ని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. అంతేకాకుండా బూతులు కూడా తిట్టినట్లు తెలుస్తోంది. న‌దీ జ‌లాల ప్ర‌వాహం విప‌రీతంగా ఉంద‌ని, కొంద‌రు వియ‌త్నాం కార్మికులు కోతను నివారించ‌డానికి అక్క‌డ కాప‌లాగా ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే చైనా సైన్యం వియ‌త్నాం కార్మికుల‌పైకి రాళ్లు రువ్వింది.

    2020లో, గాల్వాన్ వ్యాలీలో ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో చైనా సైనికులు రాళ్లు, కర్రలు, ఇతర పదునైన ఉపకరణాలతో భారత సైన్యంపై దాడి చేసినట్లుగానే.. వియత్నాంపై కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. జనవరి 3న చైనా సైనికులు వియత్నామీస్ నిర్మాణ కార్మికులపై రాళ్లు రువ్వడం, నిరాయుధులపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఉత్తర వియత్నాంలోని హా గియాంగ్ ప్రావిన్స్‌లో, చైనా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది.

    Trending Stories

    Related Stories