గ్రేటర్ నోయిడాలో ఓ బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో బలవంతంగా లిఫ్ట్ డోర్లను తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే విఫలం కావడంతో సహాయం కోసం కేకలు వేశాడు. చివరకు పది నిమిషాల తర్వాత బాలుడ్ని లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రం నిరాలా ఆస్పైర్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లిఫ్ట్‌లో బాలుడు చిక్కుకుపోయిన ఘటనపై నిరాలా ఆస్పైర్ సొసైటీ వివరణ ఇచ్చింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన బాలుడు తన సైకిల్‌తో లిఫ్ట్ డోర్‌ను కొట్టాడని, దీంతో ఐదో అంతస్తు మధ్యలో చిక్కుకున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్‌ను వినియోగించే పిల్లలు లిఫ్ట్ డోర్‌కు కాస్త దూరంగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించింది. లిఫ్ట్ సేఫ్టీపై ఎన్వోసీ కూడా ఉందని, అయితే ముందు జాగ్రత్త కోసం లిఫ్ట్‌ను చెక్ చేయాలని సంబంధిత కంపెనీని కోరినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు బాలికలు చిక్కుకుని ఏడ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.