బోరు బావిలో బాలుడు.. రంగంలోకి దిగిన ఆర్మీ

0
755

పంజాబ్ రాష్ట్రంలోని బైరంపూర్ సమీపంలోని ఖియాలా బులంద గ్రామంలో వీధికుక్కలు వెంబడుతుండగా ఆరేళ్ల బాలుడు 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), భారత సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని బావి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారికి ప్రాణవాయువు సరఫరా చేస్తూనే బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లవాడు పొలంలో ఆడుకుంటూ ఉండగా, కొన్ని వీధి కుక్కలు అతనిని వెంబడించడం ప్రారంభించాయి. బోరుబావిని మూసి ఉంచిన జనపనార సంచి మీదకు ఎక్కాడు.. బాలుడి బరువును తట్టుకోలేకపోవడంతో అతడు బోరు బావిలో పడిపోయాడు.

చిన్నారిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. బోర్‌వెల్ వైపు సొరంగం తవ్వేందుకు జేసీబీని ఉపయోగిస్తూ ఉన్నారు. బాలుడు బోరుబావిలో 95 అడుగుల మార్క్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. బోర్‌వెల్‌లో తలకిందులుగా పడిపోవడంతో క్లిప్ సహాయంతో బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లాడు సురక్షితంగా బయటపడాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.