More

    13 సంవత్సరాలుగా గణపతి సేవా సమితికి అధ్యక్షురాలిగా ముస్లిం మహిళ

    గణపతి సేవా సమితికి గత 13 సంవత్సరాలుగా అధ్యక్షురాలిగా ఉంది ఒక ముస్లిం మహిళ. ఆమె గణపతి పూజా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తూ ఉండడం అభినందనీయం. కర్ణాటక రాష్ట్రాం చిక్ మగళూరు జిల్లాలోని ఎన్ ఆర్ పురానికి చెందిన జుబేదా పంచాయతీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆమె గత 13 సంవత్సరాలుగా రాజీవ్ నగర్ గణపతి సేవా సమితి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆమె అధ్యక్షతన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వినాయక చతుర్థి పండుగ సమయంలో జుబేదా స్వయంగా పూజలు చేస్తారు. సాధారణంగా ముస్లిం సమాజంలో మహిళలు పని చేయడానికి అనుమతించరు. అయితే జుబేదా ఈ నిబంధనలను ఉల్లంఘించి గత రెండు దశాబ్దాలుగా గణపతి పూజలో పాల్గొంటున్నారు.

    జుబేదా తన గ్రామంలోని యువత సహాయంతో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది తమ గ్రామంలో ఘనంగా వినాయక చవితిని నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తన కుటుంబం మనుషులంతా ఒక్కటే అని నమ్ముతుందని.. తనకు మతానికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని అన్నారు. ఎప్పటికీ శాంతి, మత సామరస్యాన్ని ప్రభావితం చేయకూడదని తెలిపారు. ఈ సంవత్సరం గణపతి విగ్రహంతో పాటు, దివంగత కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫోటోను కూడా పూజించారు. ముస్లిం సమాజంలో మహిళలను శ్మశానవాటికకు వెళ్లనివ్వరు. అయినప్పటికీ చాలా మంది అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో జుబేదా ప్రజలకు సహాయం చేసింది. జుబేదా అంటే స్థానికులకు ఎంతో గౌరవం.

    spot_img

    Trending Stories

    Related Stories