More

    రోడ్డుపై దొరికిన 45 లక్షలు తిరిగిచ్చిన ట్రాఫిక్ పోలీసు

    ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై దొరికిన 45 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రూ.45 లక్షలతో కూడిన బ్యాగ్‌ను ఉన్నతాధికారులకు అందించాడు. అతడి నిజాయితీని పోలీసులు ప్రశంసించారు.

    నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా.. రోడ్డుపై ఓ బ్యాగ్ ను చూశాడు. అందులో డబ్బులు ఉన్నట్లు తెలుసుకున్న ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ డబ్బును అప్పగించినట్లు ఎస్పీ సుఖానందన్ రాథోడ్ తెలిపారు. బ్యాగ్ ను తనిఖీ చేయగా.. మొత్తం రూ. 2000, రూ. 500 నోట్లలతో రూ. 45 లక్షలు కనిపించాయి. నిలంబర్ సిన్హాకు సీనియర్ అధికారులు రివార్డు ప్రకటించారు. బ్యాగ్ గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి బ్యాగ్‌ని సివిల్‌లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో జమ చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. సీనియర్ అధికారులు సిన్హాకు రివార్డు ప్రకటించారు.

    Trending Stories

    Related Stories