National

కొవాగ్జిన్ మీద అనుమానాలు వ్యక్తం చేసిన ఛత్తీస్ ఘర్ హెల్త్ మినిస్టర్.. ఇప్పుడు అదే వ్యాక్సిన్

భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్లను వినియోగిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్లను భారతీయులకు అందుబాటులోకి తీసుకుని వచ్చే క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. భారతదేశంలో తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కొవ్యాక్సిన్ మీద ఎంతో మంది నేతలు రాజకీయాలు చేశారు. అయితే కోవ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని వైద్యులు, నిపుణులు చెప్పారు.
పలువురు రాజకీయ నాయకులు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లను వేయించుకుంటూ ఉన్నారు. ఛత్తీస్ ఘర్ హెల్త్ మినిస్టర్ టి.ఎస్.సింగ్ డియో కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈయనే ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో స్వదేశీ టెక్నాలజీతో తయారైన కోవ్యాక్సిన్ పై అనుమానాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం ఆయన కొవ్యాక్సిన్ ను వేయించుకున్నానని.. ప్రతి ఒక్కరూ వేయించుకుని ఛత్తీస్ ఘర్ ను సురక్షితంగా మార్చాలని అన్నారు. టి.ఎస్.సింగ్ డియో ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కరోనా నుండి కోలుకున్న ఆరు వారాల తర్వాత కొవ్యాక్సిన్ ను వేయించుకున్నానని తెలిపారు.


ఈ ఏడాది ఆరంభంలో టి.ఎస్.సింగ్ డియో కొవ్యాక్సిన్ విషయంలో అసత్యాలను ప్రచారం చేశారు. భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తో కలిసి కొవ్యాక్సిన్ ను తయారు చేయగా.. ఆ వ్యాక్సిన్ పనితీరును, సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. జనవరి 21న యూనియన్ హెల్త్ మినిస్ట్రీకి లేఖ కూడా రాశారు టి.ఎస్.సింగ్ డియో. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినప్పటికీ ఆయన నుండి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని సొంత పార్టీ నాయకులే ఊహించలేకపోయారు. కొవ్యాక్సిన్ సరఫరాను ఆపాలని కూడా ఆయన అప్పట్లో అధికారులను ఆదేశించారు.

అయితే ఆయన చర్యలను, వ్యాఖ్యలను యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా తప్పుబట్టి అక్షింతలు కూడా వేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాకుండా.. ప్రజల్లో కొత్త భయాలను సృష్టిస్తున్నారంటూ విమర్శలు చేశారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో రాజకీయాలు అనవసరమని సూచించారు. ఆనాడు ఏ వ్యాక్సిన్ విషయంలో అయితే టి.ఎస్.సింగ్ డియో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో.. ఇప్పుడు అదే వ్యాక్సిన్ ను వేయించుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =

Back to top button