NH Opinion

ఇంకెంతకాలం దండకారణ్యంలో రక్తపుటేరులు?

ఏం చెప్పాలి..? ఎలా మొదలు పెట్టాలి..? ఎవరిది తప్పు? కాలం చెల్లిన సిద్ధాంతం మని తెలుసు? తుపాకీ గొట్టడం ద్వారా.., ఇప్పుడు రాజ్యాధికారం రాదని తెలుసు? ఏ మావో పేరు పెట్టుకుని ఉద్యమం చేస్తున్నారో .., ఆ మావోపుట్టిన చైనాలోనే సోషలిజం, సామ్యవాదాన్ని పక్కన పెట్టేశారు. పార్టీ నియంతృత్వం, రాజ్యాహింస ఇప్పుడక్కడ కామన్.!

అందరూ మరిపోతున్నారు? కానీ మన దేశంలోని మావోయిస్టులు మారడం లేదు.? నగరాల్లో మేధావులు పేరుతో, వర్శిటీ ప్రొఫెసర్ల పేరుతో ముసుగు వేసుకున్న అర్బన్ నక్సలైట్లు, అలాగే జర్నలిస్టుల ముసుగులోని వామపక్షవాదులు, ఇంకా తెలుగు మెయిన్ స్ట్రీమ్ లోని కొన్ని పత్రికలు, చానళ్లు ఇప్పటికీ కూడా, ఈ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని, నక్సల్ హింసాత్మక చర్యలను తమ తప్పుడు రాతలతో గ్లోరిఫై చేస్తూనే ఉన్నారు. మావోయిస్టులు పారిస్తున్న ఈ రక్తపుటేరుల్లో సైతం వీరందరూ పరోక్షంగా భాగస్వాములవుతున్నారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాల అడవుల్లో భద్రత బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో 25 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కోబ్రా కమాండర్ ను మావోయిస్టులు బందీగా పట్టుకున్నారని తెలిసింది. ఇంకా విగతజీవులుగా పడిన జవాన్ల నుంచి ఆయుధాలను, వారి జేబుల్లో నుంచి వ్యక్తిగత వస్తువులను సైతం మావోయిస్టులు లూటీ చేశారు. మావోయిస్టులు జరిపిన ఈ మారణకాండ  ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లొనైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ దుశ్చర్య ను ఖండించారు.

ఇక మావోయిస్టులతోపాటు, వారికి వంతపాడేవారిని అర్బన్ నక్సల్స్ ను ఉపేక్షించేది లేదని హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు.నరహంతక మావోయిస్టుల చేతుల్లో, అమరులైన జవాన్ల పార్థివదేహాలకు ఆయన నివాళులు అర్పించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ -3 ని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

అయితే దేశ ప్రజలారా ఒక్కసారి ఊహించుకోండి.! ఇదే ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల చేతుల్లో మావోయిస్టులు పదుల సంఖ్యలో మరణిస్తే…, మన ది గ్రేట్ తెలుగు పత్రికలు, నేషనల్ మీడియాలో జర్నలిస్టుల ముసుగులో పనిచేసే నక్సల్స్ సానుభూతి పరులు ఏం రాసేవారు.! బూటకపు ఎన్ కౌంటర్! ఎన్ కౌంటర్ పై అనుమానాలు.? అమాయకులను నక్సల్స్ ముద్రవేసి చంపేశారా? అంటూ హెడ్డింగులు పెట్టేవారు.!  మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో, ప్రజా సంఘాల పేరుతో అర్బన్ నక్సల్స్, అభ్యుదయవాదులదరూ రంగంలోకి దిగేవారు. రాజ్యా హింస పెరిగిపోతోంది. రాజ్యమే తన పౌరులను హత్య చేస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు రక్షణ లేదా అంటూ గగ్గొలు పెట్టేవారు. దేశ హితం కంటే కూడా తమకు రేటింగ్గే ముఖ్యమనుకునే మీడియా ఛానెళ్లు చర్చలు మొదలు పెట్టేవి. విప్లవ రచయితలతోపాటు, పొలిటిషన్ల వరకు అందరూ కూడా మరణించిన నక్సల్స్ పై సానుభూతిని ప్రకటించేవారు. భద్రతా బలగాల తీరును ఖండించేవారు. ఎన్ కౌంటర్  హైకోర్టులో పిల్స్ వేసేవారు. సిట్టింగ్ జడ్జీ చేత సమగ్ర విచారణ జరపాలంటూ డిమాండ్లు చేసేవారు.

అయితే మావోయిస్టులు చనిపోయినప్పుడు లేచే ఈ గొంతులు ఇప్పుడు మూగబోయాయి ఎందుకు? చనిపోయింది జవాన్లు..! అయితే వారు మనుషులు కారా? వారికి మానవ హక్కులుండవా?  దేశ రక్షణ కోసం, ప్రజల మాన, ప్రాణాల, రక్షణ కోసం జవాన్లు తమ ప్రాణాలను బలిపెట్టలేదా? ఎవరైనా మేమూ జీతం ఇస్తున్నాం కదా! మా కోసం మీ ప్రాణాలను బలి పెట్టడండి అంటే ఎవరు పెడతారు?  దేశ రక్షణ కోసం, కర్తవ్యనిష్టలో తమ ప్రాణాలను బలిపెట్టేందుకు ముందుకు వచ్చేవారే జవాన్లు! అలాంటి జవాన్లు అమరులైతే మన తెలుగు మీడియా చానళ్లు, కుహానా మేధావులు కనీసం నివాళులు అర్పించరు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై గొంతెత్తి అరిచే హక్కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, అభ్యుదయవాదులు, విప్లవ రచయితలు.., ఇప్పుడు జవాన్ల మృతిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు.? మావోయిస్టుల జరిపిన దుశ్చర్యను ఎందుకు ఖండించరు? 

ఈ మధ్యకాలంలో మేధావుల ముసుగులో నగరాల్లో తిష్టవేసిన అర్బన్ నక్సల్ కొంతమందిని NIA అరెస్టు చేసినప్పుడు, వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇలా డిమాండ్ చేసినవారిలో సోకాల్డ్ లెఫ్ట్, లిబరల్ మేధావులు, అవార్డు వాపసీ గ్యాంగులు, విదేశీ నిధుల కోసం వెంపర్లాండె ఎన్జీవో సంఘాల నేతలు ఉన్నారు. వీరంతా అర్బన్ నక్సల్స్  తరపున వకల్తా పుచ్చుకుని, సంతకాల ఉద్యమం కూడా నడిపారు. మేధావులైనవారిని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని, స్టేట్ మెంట్లు ఇస్తూ తెలుగు మీడియాలో వారి కోసం డిబేట్లు కూడా నడిపారు. మావోయిస్టుల విడుదల కోసం, అర్బన్ నక్సల్ కోసం..,  సంతకాల ఉద్యమం చేసినవారంతా ఇప్పుడు ఈ మావోయిస్టులు జరిపిన ఈ మారణకాండకు బాధ్యత వహిస్తారా? చెప్పండి.!

ఇప్పుడు కాలం మారింది. అంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతున్నారు. ఎవరికి వారే ఉపాధి అవకాశాలు వెతుక్కొవడమే కాదు.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న రోజులివి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలను అప్ డేట్ చేయాలి. అవకాశాలను అందింపుచ్చుకునేలా వారిని ఎడ్యూకేట్ చేయాలి. అంతేకాని తుపాకీ పట్టండి…, అడవులకు వెళ్లండి.., నక్సల్స్ గా మారండి అంటూ, ఇంకా కాలం చెల్లిన సిద్ధాంతాన్ని నూరిపోస్తూ ప్రజలను తప్పుదొవ పట్టించడం ఇకనైనా మానండి.!

నక్సల్ బరి ఉద్యమాన్ని ప్రారంభించిన నేతలే తాము తప్పు చేశామంటూ ఆత్మహత్యలు చేసుకున్నారు.ఎంతోమంది ఉద్యమంలో పనిచేసి…ఆ తర్వాత రియలైజ్ అయి ప్రభుత్వానికి లొంగిపోయి…, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకు సేవా చేస్తున్న సీతక్కలాంటి వారు ఉన్నారు. అలాగే మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన దివంగత బాలగోపాల్ లాంటి అడ్వకేట్లే ఆ తర్వాత కాలంలో మావోయిస్టుల తీరును ఎండగడుతూ పుస్తకాలు రాసిన విషయం మనం మర్చిపోరాదు.

ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే నిరసన తెలుపువచ్చు. రాజ్యాంగం మనకు ఆ హక్కును ఇచ్చింది. అయితే ఆ నిరసన ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టానికి లోబడి ఉండాలి. అలాగే ప్రభుత్వ  నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయవచ్చు. అంతేకాని తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అంటూ ఇంకా అమాయకులైన ప్రజలను, ముఖ్యంగా గ్రామీణులను, గిరిపుత్రులను మోసం చేయడాన్ని అర్బన్ నక్సల్ మానివేయాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది అర్బన్ నక్సల్స్ రచయితల పేరుతో తెలుగు సినిమా రంగంలోనూ చొరబడ్డారణే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన నక్సల్స్ సిద్ధాంతాలను సీరియళ్ల రూపంలో, సినిమాల రూపంలో తెరకెక్కిస్తూ ప్రచారం చేస్తున్నారనే విషయం మర్చిపోరాదు. సినిమా దర్శకులు, రచయితల ముసుగు వేసుకున్న ఈ మూవీ నక్సల్ పై కూడా ఎన్ఐఏ లాంట దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

దేశ ప్రజలారా చూస్తున్నారు కదా..! ఒక వైపు పాకిస్తాన్ ఉగ్రవాదం, ఇంకొవైపు చైనా విస్తరణవాదం, ఇటు మావోయిస్టులు జరుపుతున్న రక్తపాతం. విదేశీ శత్రువులు ఒకవైపు.. మరోవైపు దేశంలో తిష్టవేసిన అంతర్గత శత్రువులు మన దేశానికి పెనుముప్పుగా మారుతున్నారనే విషయం మనం మార్చిపోరాదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. జాతీయవాదులందరం సంఘటితమవుదాం. జాతివిచ్ఛిన్నకర శక్తులను ఎక్కడికక్కడ ఎండగడుతూ సవాల్ విసురుదాం!    

Related Articles

Leave a Reply

Your email address will not be published.

14 − two =

Back to top button