More

    దేశంలో ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత..!

    భారతదేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 17వ తేదీన నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో వదిలారు. ఇందులో ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కూనో నేషనల్‌ పార్క్‌ లో నమీబియా చీతాకు నాలుగు పిల్లలు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర మంత్రులు ఈ చీతా పిల్లల చిత్రాలను, వీడియోను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

    మనదేశంలోని చివరి చీతా 1947లో మరణించింది. ఈ క్రమంలో దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది. అంతరించి పోయిన చీతాల సంతతిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ చీతాను ప్రారంభించింది. మరోవైపు సోమవారం ఆడ చీత సాషా మృతి చెందింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో సాషా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సాషా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించాయి.

    Trending Stories

    Related Stories