More

    షరతుల్లేకుండాన జవాన్ విడుదల..! ఆపరేషన్ ప్రహార్ 3 కొనసాగుతుందా..?

    ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్‌సింగ్‌‌ను నక్సలైట్లు బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

    తొలుత మీ జవాన్ మా వద్దనే ఉన్నాడని.. మా షరతులకు ఒప్పుకుంటే మేము మీకు మీ జవాన్ అప్పగిస్తామన్నారు మావోయిస్టులు. ఆపరేషన్ ప్రహార్ వంటివి ఆపాలంటూ హెచ్చరించారు. పోలీసులు మాకేం శత్రువులు కాదన్నారు. తమ డిమాండ్లను వినిపిస్తూ 2 పేజీల లేఖను విడుదల చేశారు. దీంతో జవాన్ రాకేస్ సింగ్ విడుదలపై టెన్షన్ నెలకొంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా గుడ్ న్యూస్ వినిపించిది. అదే మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి కలిగిందనే వార్త. ఐదు రోజులుగా  రాకేశ్వర్‌సింగ్‌ మావోల చెరలో ఉన్నాడు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు వదిలేశారు. ఇక బెటాలియన్‌కు జవాన్‌ చేరుకోవడమే తరువాయి. 

    ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్‌సింగ్‌‌ను నక్సలైట్లు బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

    చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని ప్రభుత్వానికి మావోయిస్టులు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక ముందే మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ విడుదల చేయడం ఆసక్తిగా మారింది. జవాన్‌ విడుదలను ఛత్తీస్‌గడ్‌ ఐజీ ధ్రువీకరించారు.

    మావోయిస్టులు తమ అధీనంలో కి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌ను  వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక ఒక ప్రకటనలో కోరింది 

    ఈనెల 3న భద్రతా దళాలు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. తమకు చెందిన నలుగురు మృతి చెందారని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తమ వద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. 

    ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం స్పందించలేదు. అకస్మాత్తుగా జవాన్‌ను విడుదల చేయడం మావోయిస్టుల వ్యూహం ఏమైనా ఉందా లేక కేంద్రం కఠిన చర్యలు అవలంబించకముందే తాము కొంత వెనకకు తగ్గితే బెటర్ అనుకున్నారా తెలియాల్సి ఉంది. అలాగే దేశం మొత్తం మీద ఈ ఘాతుక చర్య వ్యతిరేకతను మావోయిస్టులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఈ దేశంలో అవినీతిపరుల ఆట కట్టించడంలో.. వారికి వెన్నులో వణుకు పుట్టించడంలో ముందుండే వారిగా పేరుగల నక్సలైట్లు ఇలా భారత జవాన్లను దొంగదెబ్బతీసిమరీ పొట్టనబెట్టుకోవడం తీవ్ర చర్యగా పరిగణిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఆపరేషన్ ప్రహార్ 3 కోసం సిద్ధం కండి అని పిలుపునిచ్చిన తరుణంలో తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయి అనేది సర్వత్రా చర్చనీయాంశం.

    Trending Stories

    Related Stories