More

    బహిరంగంగా కొరడాతో కొట్టించుకున్న ముఖ్యమంత్రి

    ఛత్తీస్‌గఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్‌ బఘేల్‎ కొర‌డాతో కొట్టించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతి ఏడాది ఆడంబ‌రంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవ‌ర్ధ‌న్ పూజ అనంత‌రం కొరడా దెబ్బలు తింటే స‌మ‌స్య‌లు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ క్ర‌మంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవ‌ర్ధ‌న్ పూజ‌కు హాజ‌రైన బ‌ఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఈ ఘటనను ప్రేక్షకులు వీక్షించి వీడియోలు తీశారు. “గోవర్ధన్ పూజ” ఉత్సవాల ఆచారంలో భాగంగా చాలా మంది కూడా కొరడా దెబ్బలు తిన్నారు.

    Bhupesh Baghel on Twitter: “प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई। सभी विघ्नों का नाश हो। https://t.co/bHQNFIFzGv” / Twitter

    60 ఏళ్ల భూపేష్ బఘేల్ ఒక వ్యక్తి తన కుడి చేయి చాపి ఎనిమిది కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. తనను కొట్టిన బీరేంద్ర ఠాకూర్‌ అనే పూజారిని కౌగిలించుకున్నారు. ఈ ఆచారం జాంజ్‌గిరి అనే గ్రామంలో జరిగింది.. భూపేష్ బఘేల్ ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. మన పూర్వీకులకి ఈ చిన్న చిన్న సంప్రదాయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి… గ్రామాలలో ఈ ఆచారాలు రైతుల మేలు చేస్తాయి అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలని, కష్టాలు తీరాలని ప్రార్థిస్తూ కొరడా దెబ్బలు తినడం ఆయనకు ఏటా ఆనవాయితీగా వస్తున్నదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కొరడా ఎంతో విశిష్టత కలిగినదని.. ఇది శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారని గ్రామస్తులు తెలిపారు.

    Trending Stories

    Related Stories