ఊహించని నిర్ణయం తీసుకున్న ఛార్మి

0
821

పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘లైగర్’. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా అనుకున్న ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయింది. సినిమాపై మొదటి రోజు నుండే చాలా నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. కలెక్షన్స్ మీద భారీగా ప్రభావం చూపించింది. ట్రోల్స్ కూడా భారీ ఎత్తున వైరల్ అయ్యాయి. చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపింది.

ఈ సినిమా ఫలితం అటు హీరో విజయ్ తో పాటు దర్శకుడు పూరీ, సహ నిర్మాత ఛార్మీ కౌర్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. అందుకే ఛార్మీ కౌర్ అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘గాయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’ అంటూ హార్డ్ ఎమోజీని యాడ్ చేసి ఛార్మీ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. పూరీ, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ దాదాపు వంద కోట్ల రూపాయాల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం భారీగా నష్టాలను చవి చూసింది.