కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో.. చరణ్ జిత్ సింగ్ చన్నీని పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఏకగ్రీవంగా ఎంపికైనట్టు స్పష్టం చేశారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చన్నీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం సామాజిక న్యాయం పాటించినట్టయింది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవాను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎంపిక చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. పంజాబ్‌కు కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం నుంచి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. మొదట సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా ముఖ్యమంత్రి అన్నారు.. కానీ ఆఖర్లో చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది కాంగ్రెస్. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం అకస్మాత్తుగా రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యే రేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరియు అంబికా సోని కూడా నిలిచారు. కానీ వారు వద్దని నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 2018 లో, చన్నీ ఒక మహిళా ఐఏఎస్ అధికారికి అభ్యంతకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మహిళా అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలు తెలిపాయి. చన్నీ తనకు మరిన్ని సందేశాలు పంపినట్లు మహిళా అధికారి ఆరోపించింది. ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అతను వాటిని పంపుతూనే ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అర్థరాత్రి ఒక సందేశం పంపినప్పుడు, ఆమె అభ్యంతరం చెప్పింది. ఆయన మహిళా అధికారికి ఉర్దూ కవిత్వాన్ని పంపినప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత చన్నీ క్షమాపణలు చెప్పారు. చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు చరణ్ జిత్ సింగ్ చన్నీ.