నల్గొండ జిల్లా చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్ధమైంది. పార్టీ కార్యాలయంలో భద్రపరిచిన 5లక్షల రూపాయల విలువైన జెండాలు, ప్రచార సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అయితే.. ఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు తగలబడిపోవడం చండూరులో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పర్యటనకు ముందు ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే ఈ పనిచేశారని ఆరోపిస్తున్నారు.