More

    బీఆర్ఎస్ చంద్రబాబుకు వరమా?

    కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబుకు మేలు జరుగుతుందా..? తెలంగాణలో సైకిల్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా..? టీడీపీ బాస్ చిరునవ్వు వెనుకున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటీ..? సెంటిమెంట్‎కు కాలం చెల్లడంతో చంద్రబాబుకు రాజమార్గం ఏర్పడిందా..? బీఆర్ఎస్ ప్రకటన టీడీపీ బాస్‎కి వరంగా మారడం వెనుకున్న మతలబ్ ఏంటీ..? తెలంగాణపై బాబు అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది. 

    ఉమ్మడి ఏపీలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన తర్వాత… ఏపీకే పరిమితమైన సైకిల్ పార్టీ, తెలంగాణలో దాదాపుగా ఖాళీ అయిపోయింది. చెప్పుకోదగిన లీడర్ ఒక్కరంటే.. ఒక్కరు కూడా టీడీపీలో లేరు. అంతా టీఆర్ఎస్ బాట పట్టడంతో… కారు పార్టీని చూస్తే… టీడీపీ బీ టీమ్ అనొచ్చు. అంటే టీడీపీ టీమ్ మొత్తం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి… తెలంగాణలో బీఆర్ఎస్ రూపంలో ఆక్సిజన్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

    తెలంగాణ సెంటిమెంట్‎తో సీఎం సీటును కొట్టేసిన సీఎం కేసీఆర్… ఉద్యమ సమయంలో టీడీపీని మాత్రం మాటలతో ఎన్‎కౌంటర్ చేశారు. మాట్లాడితే టీడీపీ ఎక్కడి వారి పార్టీ అని దుమ్మెత్తి పోసిన గులాబీ బాస్… మొత్తం మీద తెలుగుదేశానికి ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ గురించి… చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం వెనుక…. ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నట్లు అర్థమవుతోంది.

    ఇప్పుడు సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రకటనతో… టీడీపీని ఓ ప్రాంత పార్టీగా దూషించడం సాధ్యం కాదు. అలాగే టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్‎గా మారడంతో సెంటిమెంట్‎కు కాలం చెల్లింది. అయితే బడుగు, బలహీనవర్గాలకు చెందిన కురువృద్ధులు టీడీపీ చెంతకు చేరేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు మాత్రం యువ రక్తాన్ని నింపడం ద్వారా… పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ముందడుగు వేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ రూపంలో చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం ఏర్పడటంతో పాటు….వెంటిలేటర్‎పై ఉన్న టీడీపీ ఊపిరిపోసినట్టైంది.

    Trending Stories

    Related Stories