More

    వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

    వైసీపీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసుల అండతో రెచ్చిపోతే ఫలితం అనుభవిస్తారని.. నేను కన్నెర్ర చేస్తే బయటకు కూడా రాలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి ఒక బూటకమని, ఇంగ్లీష్ మీడియం నాటకమని చంద్రబాబు అన్నారు. జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదన్నారు. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని అన్నారు. స్కూళ్లను మూసివేయడానికి వీలులేకుండా మినీ మహానాడులో తీర్మానం చేద్దామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు చేతకాని పాలనే నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పోలీసులు రెచ్చిపోతే ప్రజల చేత ఎలా తిరుగుబాటు చేయించాలో తనకు తెలుసునని అన్నారు. తాను ఇచ్చిన దీపం పథకాన్ని ఆపేశారన్నారు. మద్యం కొత్త బ్రాండ్లను తీసుకు వచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారని ప్రజలు తిరగబడితేనే ఈ జగన్ రెడ్డికి తెలిసొస్తుందన్నారు. కేసులకు భయపడాల్సిన పనిలేదని, ఇంటికొకరు సిద్ధంగా ఉండమని, పోరాటానికి సిద్ధం కావాని చంద్రబాబు పిలుపునిచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories