More

    కక్ష సాధింపు తప్ప ఇంకేమీ లేదు: చంద్రబాబు

    నర్సీపట్నంలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్‌నేత అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీలో ఉన్న బలమైన బీసీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని.. అక్రమంగా కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, దాడులకు పాల్పడుతూ ఏపీ సీఎం జగన్‌ బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు విసిరిన ప్రశ్నలకు ధైర్యం లేక కూల్చివేతలకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ అయ్యన్నకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

    టీడీపీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ‘నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో చంద్రబాబు గారి పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకొని పిరికిపంద చర్యలు మొదలెట్టారు. అయ్య‌న్న‌పై వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుంది’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories